పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికార పీఠమెక్కిన విషయం విదితమే. మమతను ఎలాగైనా దించెయ్యాలని నానా తంటాలూ పడ్డ బీజేపీ, ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యింది. ‘గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాం’ అని బీజేపీ చెప్పుకోవచ్చుగాక.. కేంద్రంలో తమకున్న అధికారాన్నంతా ఉపయోగించినా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తాను అనుకున్నది సాధించలేకపోయింది. ఇక, ఎన్నికల తర్వాత చెలరేగిన హింస, ఈ క్రమంలో మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్నే రద్దు చేసెయ్యాలనీ, రాష్ట్రపతి పాలన విధించాలనీ బీజేపీ చేసిన యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అవన్నీ ఓ యెత్తు.. ఇటీవల వచ్చిన యాస్ తుపాను నేపథ్యంలో షురూ అయిన బీజేపీ బురద రాజకీయం ఇంకో యెత్తు. ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం నరేంద్ర మోడీ 30 నిమిషాలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. ప్రధాన మంత్రికి కనీసపాటి గౌరవం ముఖ్యమంత్రి ఇవ్వకపోవడమేంటి.? అంటూ బీజేపీ కొత్త రచ్చ షురూ చేసింది. నిజమే కదా.? ముఖ్యమంత్రి, ప్రధానిని గౌరవించకపోవడం సమర్థనీయం కాదు.. అంటూ చాలామంది విమర్శించారు. అయితే, మమతా బెనర్జీ వెర్షన్ ఈ విషయంలో ఇంకోలా వుంది.
ప్రధాని పర్యటనకంటే ముందే, తాను రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారయ్యిందనీ, ఆ పర్యటనలో వుండగా ప్రధాని పర్యటనపై సమాచారం వచ్చిందనీ, తన పర్యటన రద్దు చేసుకుని ప్రధాన మంత్రి కోసం వెళితే, అక్కడ తనను 20 నిమిషాలపాటు ప్రధానిని కలవనీయకుండా చేశారనీ మమత ఆరోపిస్తున్నారు. ‘ప్రధాని పర్యటనను బీజేపీ ఓ రాజకీయ కార్యక్రమంగా మార్చేసి, నన్ను అవమానించింది..’ అంటూ వాపోయారు మమత. ఇలాంటివి ప్రధాని మోడీకి కొత్తేమీ కావు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో మోడీ ఈ తరహా రాజకీయాలు చేశారన్న విమర్శలున్నాయి. ఇంతకీ, నిజమేంటి.? ఎవరు ఎవర్ని అవమానించారు.? ఏ సానుభూతికోసం ఈ ‘బురద’ రాజకీయం.?
705483 67829Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall look of your web site is fantastic, as nicely as the content! 425149
477021 909349Its always excellent to learn ideas like you share for weblog posting. As I just started posting comments for blog and facing dilemma of lots of rejections. I feel your suggestion would be helpful for me. I will let you know if its work for me too. 406023
742199 615681As soon as I discovered this web site I went on reddit to share some of the enjoy with them. 5999