ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కవచ్చునని ముందస్తు సర్వేలు చెప్పినప్పటికీ, సరిగ్గా ఎన్నికలకు ముందు పెంచిన పెన్షన్లు, మహిళలకు ప్రసాదించిన వరాలు, రైతులకు అందించిన సాయం ఇవన్నీ చంద్రబాబుకే తిరిగి అధికారం కట్టబెట్టవచ్చునని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న సంగతి తెల్సిందే. అయినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరిగింది ఇద్దరి మధ్య రాజకీయ పోరాటం కాదు. ఇది ముగ్గురి మధ్య జరిగిన ఎన్నికల పోరు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, జనసేన కూడా ఈ ఎన్నికలపై గట్టి ప్రభావమే చూపింది.
రాజకీయాల్లో ఐదు, పది ఓట్లతో కూడా ఓటమి పాలయ్యే పరిస్థితులుంటాయి కొన్ని సార్ల అభ్యర్థులకి 2014 ఎన్నికల్లో 2 వేల ఓట్ల లోపు తేడాతో ఓడిపోయినవారి సంఖ్య చాలా ఎక్కువే. దాంతో, ఇప్పుడు ముక్కోణపు పోరు కాబట్టి ఈ ‘మార్జిన్’ ఇంకా దారుణంగా పడిపోతుంది. సర్వేల్లో గెలుస్తాడనుకున్న వ్యక్తి అనూహ్యంగా వాస్తవ ఫలితాల్లో ఓడిపోవచ్చు. సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు, ఈ కోణంలోనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలా వుంటే, శాసనమండలికి పంపి తన కుమారుడ్ని తన మంత్రి వర్గంలోకి తీసుకున్న చంద్రబాబు, మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మాత్రం లోకేష్‌ని మంత్రి వర్గంలోకి తీసుకోరట. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారాంశమిది. లోకేష్‌కి జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని సమాచారమ్. మంగళగిరి నుంచి లోకేష్ గెలవడం కష్టమేనని చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీ వైపుగా లోకేష్ అన్న సంకేతాలు టీడీపీ వర్గాల నుంచి జోరందుకుంటున్నాయి.
గెలుపోటముల సంగతి పక్కన పెడితే, లోకేష్ తనకు వచ్చీరాని తెలుగుతో చాలా సతమతమవుతున్నారు. అది ప్రతిసారీ తెలుగుదేశం పార్టీకి సంకటంలా మారుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేష్‌ని ఢిల్లీకి పంపితే, ఇంగ్లీషులో లోకేష్‌కి ఎలాగూ ఇబ్బంది వుండదనే నిర్ణయానికి వచ్చారట. అయితే, ఏ నిర్ణయమైనా మే 23 తర్వాతే వుంటుందని, లోకేష్ కూడా జాతీయ రాజకీయాలపై ఆసక్తితో వున్నారనీ తెలుస్తోంది. జాతీయ రాజకీయాలంటే, ఒకవేళ చంద్రబాబు అనుకుంటున్నట్లు దేశంలో రాజకీయ సమీకరణాలు మారి తాను అనుకుంటున్న ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వస్తే.. కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ లోకేష్‌కి వుంటుందేమో.!
కొంతమంది ఇది జరిగే పని కాదని అనుకోవచ్చుగానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాజకీయం అంటేనే అంత. లోకేష్ ‘సుడి’ బావుంటే, అతని రేంజ్ ‘కేంద్ర మంత్రి’ స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోయే పనేముంది?
539392 689855Hello! I basically would like to give a huge thumbs up for the excellent info youve here on this post. I might be coming back to your weblog for a lot more soon. 500172
461850 62450I was suggested this internet site by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my dilemma. Youre incredible! Thanks! 256993
823091 42888Hello, Neat post. There is actually a dilemma together with your website in internet explorer, could test thisK IE nonetheless could be the marketplace leader and a large portion of individuals will leave out your exceptional writing due to this problem. 927576
611543 850031I believe 1 of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 76916