చిన్న సినిమాగా తెరకెక్కిన మేమ్ ఫేమస్ వరస ప్రమోషన్స్ తో సందడి చేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో, సోషల్ మీడియా ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించగలిగింది ఈ చిత్రం. ముఖ్యంగా ప్రముఖ సినీ తారలు, దర్శకులు ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయడంతో బజ్ తెచ్చుకుంది. సుమంత్ ప్రభాస్, మణి, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
తెలంగాణలోని బందనర్సంపల్లి అనే పల్లెటూర్లో మై, బలి, దుర్గ ముగ్గురూ చిన్ననాటి నుండి స్నేహితులు. మై… మౌనికను ప్రేమిస్తే, బలి… బబ్బి తో ప్రేమలో పడతాడు. అయితే తమ ప్రేమను దక్కించుకోవడానికి తమకు గుర్తింపు రావడానికి ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకుంటారు.
ఇంతకీ వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఏమేం చేసారు? వాళ్ళ ప్రేమను గెలుచుకోగలిగారా లేదా?
నటీనటులు:
సుమంత్ ప్రభాస్ వయసులో చిన్నవాడైనా అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ తన సొంతం. తన ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అన్నీ కూడా మెప్పిస్తాయి. తను డైలాగ్స్ చెప్పే విధానం కూడా సూపర్బ్ అనే చెప్పాలి. మంచి స్క్రిప్ట్స్ పడితే అద్భుతమైన నటుడు అవ్వగల లక్షణాలు సుమంత్ ప్రభాస్ సొంతం.
మణి, మౌర్య చౌదరి ఇద్దరూ కూడా హీరో చిన్ననాటి స్నేహితులుగా నటించారు. ఇద్దరూ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఇక హీరో గర్ల్ ఫ్రెండ్ గా సార్య చేసింది. ప్రీ-క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీక్వెన్స్ లో ఆమె నటన స్టాండౌట్ గా నిలుస్తుంది. సిరి రాశి కూడా ఓకే. కిరణ్ మచ్చ, శివ నందన్, అంజి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్… మిగతావాళ్లంతా తమ పరిధుల మేరకు నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రానికి కథ సుమంత్ ప్రభాస్ రాసుకున్నాడు. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేదు. ముగ్గురు ఆవారాగా తిరిగే కుర్రాళ్ళకి జీవితంలో సెటిల్ అయ్యేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు ఈ చిత్ర సమాహారం. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. చిత్రంలో అక్కడక్కడా కామెడీ వచ్చినా కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్… రెండిట్లోనూ ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే భారత్ సీన్, సెకండ్ హాఫ్ లో వచ్చే యూట్యూబ్ ట్రాక్ వీటికి చక్కని ఉదాహరణలు.
ఈ చిత్రంలో వచ్చే తెలంగాణ సంభాషణలు చక్కగా సరిపోతాయి. కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు నరేషన్ లో కలిసిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్బ్ అనే చెప్పాలి. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ నిర్మాణ విలువలు చిత్ర బడ్జెట్ కు సరిపోయాయి.
ప్లస్ పాయింట్స్:
- సుమంత్ ప్రభాస్ పెర్ఫార్మన్స్
- కామెడీ, డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్
- స్క్రిప్ట్ లో కొత్తదనం లేకపోవడం
- లవ్ ట్రాక్స్
- సింక్ సౌండ్ సెట్ అవ్వకపోవడం
విశ్లేషణ:
మొత్తానికి మేమ్ ఫేమస్ చూడటానికి షార్ట్ ఫిల్మ్ లా అనిపించే చిత్రం. కొన్ని యూత్ సీన్స్, కామెడీ సీన్స్ ప్లస్ పాయింట్స్ కాగా మొత్తంగా చూసుకుంటే ల్యాగ్ సీన్స్ చిత్ర ఫ్లో ను తగ్గించేస్తాయి. మీకు ఈ వీకెండ్ బోర్ కొడితే ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5