జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెల్సిందే. రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘స్క్రిప్టులు’ అందిస్తున్నారన్న ప్రచారం తర్వాత పవన్ – త్రివిక్రమ్ కలవడం బాగా తగ్గిపోయింది. అయితే, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఈ మధ్య వీలు చూసుకుని పలుసార్లు త్రివిక్రమ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్ జానీ, తాను త్రివిక్రమ్ ఇంట్లో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని కలిసినట్లు చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశాడు. దాంతో త్రివిక్రమ్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ సినిమా.. అనే ప్రచారం కూడా తెరపైకొచ్చింది. అయితే, త్రివిక్రమ్ – పవన్ పదే పదే భేటీ అవుతుండడం వెనుక వేరే కారణాలున్నాయట.
సినిమాలు, రాజకీయాలు.. ఈ ఇద్దరి మధ్యా చర్చకు రావడం మామూలే. రాజకీయ అంశాలు చాలా తక్కువగా, సినీ విషయాలు చాలా ఎక్కువగా ఈ మధ్య వీరిద్దరి చర్చల్లో వస్తున్నాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా రావడం అన్నది పెద్ద విషయమే కాదు. కథ సెట్టయితే, త్రివిక్రమ్ ఏ క్షణాన అయినా సినిమాని అనౌన్స్ చేసేయ్యొచ్చు.
అయితే, త్రివిక్రమ్ – పవన్ కలిసి కట్టుగా సినిమాల నిర్మాణం దిశగా సమాలోచనలు చేస్తున్నారన్నది తాజా ఖబర్. అన్నీ కుదిరితే, ఉగాది నాటికి ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయట. అయితే, దర్శకుడిగా హయ్యస్ట్ పొజిషన్లో వున్న త్రివిక్రమ్, నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా చూసుకోగలడా.? అన్నదే ఇక్కడ కీలకమైన అంశం.
పవన్ ఇటు నటన, అటు రాజకీయం.. రెండూ చూసుకోవడం కష్టమే. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో వున్నారు. ఈ నేపథ్యంలో పవన్, త్రివిక్రమ్.. స్లీపింగ్ ప్రొడ్యూసర్స్‌గా వుంటూ ఇంకొకర్ని యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా రంగంలోకి దించాలనుకుంటున్నారట. ఆ విషయం ఓ కొలిక్కి వస్తే.. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ నిర్మాణ సంస్థ, దాన్నుంచి ఓ రెండు మూడు సినిమాల అనౌన్స్‌మెంట్లూ రాబోతున్నాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
345729 3748This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as nicely within the have a a lot healthier lifetime. shed weight 941068
193004 848271An intriguing discussion is worth comment. Im certain which you merely write regarding this topic, might possibly not be considered a taboo subject but typically persons are too little to communicate on such topics. To another. Cheers 94372
244750 291843I admire your piece of work, regards for all of the interesting posts . 545090
738094 512602magnificent post, really informative. I wonder why the other specialists of this sector do not notice this. You should continue your writing. Im positive, youve an excellent readers base already! 840077