Manchu Manoj: కొత్త పెళ్ళికొడుకు అత్తారింటికి తొలిసారిగా వెళితే మాత్రం, భారీ కాన్వాయ్ అవసరమా.? డబ్బులున్నాయ్.. సెలబ్రిటీ కూడా.! ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా.? ఇంతకీ, పోలీసు వాహనం ఎందుకు.? వెంట ఓ ఎమ్మెల్యే ఎందుకున్నారు.?
తెలుగు రాజకీయాల్లో మంచు మనోజ్, అత్తారింటికి వెళ్ళడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనే మంచు మనోజ్‌కి పెళ్ళి కాగా, కొన్ని కారణాలతో ఆ జంట విడిపోయింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక రెడ్డిని పెళ్ళాడాడు. మౌనిక రెడ్డి, కర్నూలు జిల్లాలో ఒకప్పుడు బలమైన రాజకీయ శక్తిగా పేరు ప్రఖ్యాతులందుకున్న భూమా దంపతుల కుమార్తె. ఆ భూమా దంపతులిప్పుడు జీవించి లేరు.
మౌనిక సోదరి అఖిల ప్రియ మాత్రం రాజకీయాల్లో వున్నారు. గతంలో ఆమె ఎంపీగానూ పనిచేశారు. మౌనికకి కూడా రాజకీయ చాతుర్యం ఎక్కువే. రాజకీయాల్లో రాణించాలని ఆమె కూడా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు దంపతుల కర్నూలు పర్యటన.. ఓ రాజకీయ పర్యటనలా మారిపోయింది. ‘పెద్దల ఆశీస్సుల్ని’ నూతన దంపతులు తీసుకున్నారు.
మరోపక్క, మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే మోహన్‌బాబు ఆయన తనయుడు విష్ణు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నట్టే లెక్క. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు ఈ ఇద్దరూ.
మనోజ్ మాత్రం, రాజకీయాలకు దూరంగా వుంటాడుగానీ, లోలోపల వైసీపీ పట్ల అభిమానమే. మౌనిక రెడ్డి సోదరి అఖిల ప్రియ, ప్రస్తుతం టీడీపీలో వున్నారు. మరి, మౌనిక రాజకీయ నిర్ణయం ఎలా వుండబోతోంది.?
కర్నూలు జిల్లాలో.. అందునా ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి. సో, ఆ రాజకీయ వారసత్వాన్ని సోదరి అఖిలప్రియతోపాటు తానుకూడా కొనసాగించాలని మౌనిక అనుకోవడంలో వింతేముంది.?
931899 918233Hi my loved one! I wish to say that this post is wonderful, fantastic written and come with almost all critical infos. I would like to see far more posts like this . 344661
700239 729680My plate is real full and your tryna give me more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 264532
591390 100106Just a smiling visitor here to share the enjoy (:, btw outstanding layout. 234797
277315 237184Pretty section of content material. I just stumbled upon your web site and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently rapidly. 305292