ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లో సభ్యురాలు అయిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు ఖుష్బూ. ముఖ్యంగా ఎనిమిదేళ్ల వయసులోనే తనపై తన తండ్రి లైంగిక దాడి చేసినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
“అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, చిన్న వయసులోనే లైంగికి దాడి జరిగితే దాని ప్రభావం వాళ్ళు జీవితాంతం అనుభవిస్తారు. నాపై నా తండ్రి ఎనిమిదేళ్ల వయసులోనే లైంగికంగా దాడి చేసారు. నన్ను కొట్టారు. కానీ పదిహేనేళ్ళు వచ్చే వరకూ కూడా నాకు అది చెప్పే ధైర్యం రాలేదు. మా అమ్మకు చెప్పినా ఉపయోగం లేదని నాకు తెలుసు. కొంత మంది ఉంటారు, ఏం జరిగినా పతియే ప్రత్యక్ష దైవం అని… మా అమ్మ అదే టైప్. ఫైనల్ గా నా పదహారేళ్ళ వయసులో మమ్మల్ని వదిలేసి తండ్రి వెళ్ళిపోయాడు. రేపు ఎలా గడుస్తుంది అన్న సందర్భాల్ని కూడా మేము చూసాం” అని తన భయంకరమైన గతాన్ని తలుచుకుంది.