Switch to English

మేజర్ రివ్యూ: సందీప్ ఉన్నికృష్ణన్ కు సరైన నివాళి

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie మేజర్
Star Cast అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ
Director శశి కిరణ్ తిక్క
Producer మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
Music శ్రీచరణ్ పాకాల
Run Time 2 గం 29 నిమిషాలు
Release 3 జూన్ 2022

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చిత్రం ఈరోజు విడుదలైంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. మరి ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ముందే చెప్పుకున్నట్లు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితమే ఈ మేజర్. ఎన్ఎస్జి కమాండోగా పనిచేస్తోన్న సందీప్ ఉన్నికృష్ణన్ 26/11 తాజ్ దాడుల్లో టెర్రరిస్ట్ ల నుండి పౌరులను కాపాడబోయి వీర మరణం పొందిన విషయం తెల్సిందే.

అసలు సందీప్ జీవితం ఎలాంటిది? తన చిన్నతనంలో ఆర్మీలో చేరడానికి ఎలాంటి సంఘటనలు ఉపక్రమించాయి. సందీప్ కుటుంబం ఎలా ఉండేది? ఎన్ఎస్జి కమాండోగా చేరాక తన డెడికేషన్ ఎలాంటిది? చివరికి పౌరులను కాపాడుతూ తాజ్ హోటల్ లో సందీప్ ఎలా వీర మరణం పొందాడు?

ఇవన్నీ తెలుసుకోవాలంటే మేజర్ చిత్రం చూడాల్సిందే.

నటీనటులు:

ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో సరిగ్గా సరిపోయాడు శేష్. ఆర్మీ కమాండోకు ఉండాల్సిన ఫిజిక్ ను సాధించాడు. సందీప్ బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు. ఈ సినిమా కోసం శేష్ చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

శేష్ తర్వాత ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలు సందీప్ తల్లిదండ్రులుగా చేసిన ప్రకాష్ రాజ్, రేవతిల గురించి చెప్పుకోవాలి. ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. ఇద్దరూ కూడా తమ సీనియారిటీతో తమ పాత్రలకు పూర్తిస్తాయి న్యాయం చేసారు. ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు.

సందీప్ ప్రేమికురాలి పాత్రలో సాయీ మాంజ్రేకర్ కూడా బాగానే చేసింది. అయితే సెకండ్ హాఫ్ లో కీలకమైన తరుణంలో ఆమె పాత్ర స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తుంది. ఇక హోస్టెజ్ గా శోభత నటన బాగుంది. ఇక ఆర్మీ ఆఫీసర్ గా మురళి శర్మ కూడా మెప్పించాడు.

సాంకేతిక వర్గం:

ముందుగా అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే గురించి ప్రస్తావించుకోవాలి. ఒక బయోగ్రఫీని బిగిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా తాజ్ మహల్ హోటల్ లో శేష్ స్క్రీన్ ప్లే వర్క్ సూపర్బ్. ఇక దర్శకుడిగా శశికిరణ్ టిక్కా తన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించాడు.

వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లోనే యాక్షన్ సెక్వెన్స్ లలో తన పనితనం మెప్పిస్తుంది. శ్రీచరణ్ పాకల అందించిన సంగీతం సినిమాకు వెన్నుముకగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • అడివి శేష్
  • పెట్రియోటిక్ కంటెంట్

మైనస్ పాయింట్స్:

  • కమర్షియల్ అప్రోచ్ లేకపోవడం
  • కేవలం హీరో సెంట్రిక్ ఎలివేషన్స్

మొత్తంగా:

మేజర్ టీమ్ నుండి వచ్చిన సిన్సియర్ ఎఫర్ట్ ఈ చిత్రం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని సినిమా రూపంలో మనకు అందించారు. అడివి శేష్ నటన, ప్రెజంటేషన్ కారణంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి.. అందుకు పడ్డ శ్రమ, కష్టం, నటనపై ఉన్న మక్కువ, సినిమాపై ఆసక్తి ప్రధాన కారణం. తెరపై చిరంజీవి మాస్ పవర్ చూసేందుకు...

సల్మాన్ రష్దీపై హత్యాప్రయత్నం.. కన్ను కోల్పోయి.. నరాలు తెగిపోయి..

ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆయన ఒక...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...

సూపర్ స్టార్ మహేష్ కు అద్భుతంగా విషెస్ చెప్పిన మెగాస్టార్

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా మహేష్ ను పుట్టినరోజు నాడు తమదైన శైలిలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్...

బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్...