Switch to English

ఈ ‘సలహా’ ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ‘గుదిబండ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అసలు సలహాదారులు ఎందుకు.? ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకోవడం ఎందుకు జరుగుతోంది.? ఎందుకు జరగకూడదు.? సలహాదారుల గౌరవ వేతనాలు, వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు.. ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచే.. అంటే, ప్రజల జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నదే కదా.?

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకి సంబంధించి ప్రజల్లో చర్చ జరగాలి, జరిగి తీరాలి. అదే ప్రజాస్వామ్యం. కానీ, అలా జరుగుతోందా.? అంటే, లేదనే చెప్పాలి. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికే నానా తంటాలూ పడుతోంది. రాజధాని అమరావతిని నిర్మించడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవాయె.! ఈ పరిస్థితుల్లో వృధాగా ఒక్క పైసా ఖర్చయినా.. అది క్షమార్హం కాని నేరం.

ప్రత్యేకించి సలహాదారుల విషయంలోనే ఎందుకీ వృధా ఖర్చు అనే అంశం ప్రస్తావనకు వస్తోంది.? అంటే, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ప్రతినెలా జీతాలు తీసుకునే అధికారులున్నారు. ఆ అధికారుల్ని కాదని, కొందర్ని ప్రభుత్వం సలహాదారులుగా ప్రత్యేకంగా నియమించుకోవడం.. వారికి బోల్డంత సొమ్ము గౌరవ వేతనాల రూపంలో ఖర్చు చేయడం, వారికి ఇతర సౌకర్యాలు కల్పించడానికీ భారీయెత్తున నిధులు వెచ్చించడం.. ఇదంతా వివాదాస్పదమవుతోంది.

మీడియా సలహాదారు ఏం చేస్తున్నట్టు.? కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు ఎందుకు.? ఇలా ప్రతి సలహాదారు పోస్టు గురించీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మరి, ప్రభుత్వం.. ప్రజలకు ఈ సలహాదారుల వేతనాల విషయమై సమాధానం చెబుతుందా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

సాక్షి మీడియాలో పనిచేసిన ఉద్యోగులకు వైసీపీ అధికారంలోకి వచ్చాక రకరకాల పదవులు దక్కాయి. అందులో సలహాదారులూ వున్నారు. వీళ్ళకే ఏకంగా 200 కోట్లు ఖర్చు చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత.? వాస్తవం కాకపోతే, ఆయా మీడియా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వుంది.

కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, కొమ్మినేని శ్రీనివాసరావు.. ఇలా సాక్షి ఉద్యోగులు చాలామందే ప్రభుత్వంలో పలు రకాల పదవుల్ని పొందారాయె.! సాక్షి ఉద్యోగులకి ప్రజాధనాన్ని వెచ్చించడమా.? అన్న ప్రశ్న వస్తోంది మరి. ప్రభుత్వం తరఫున సమాధానం ఎలా వుండబోతోందో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...