ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ సినిమా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశాడు హీరో ప్రభాస్. దాంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎక్కడో కాలింది. టీడీపీతోనే వున్నా, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ శ్రేణులు అప్పుడప్పుడూ అక్కసు వెల్లగక్కుతుండడం సహజమే.
అయితే, టీడీపీ శ్రేణులు ‘సాహో’ పట్ల నెగెటివ్ క్యాంపెయిన్ని సోషల్ మీడియాలో షురూ చేశాయంటూ ఓ వెబ్సైట్ కథనాన్ని వండి వడ్డించడంతో, ఈ వ్యవహారంపై లోకేష్ సీరియస్‌గా స్పందించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, తద్వారా వచ్చిన సంపాదనతో బతుకుతున్నారా.? అంటూ కాస్తంత ఘాటుగా లోకేష్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అన్నట్టు, ‘సాహో’ సినిమా విడుదల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాననీ, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని తాను కోరుకుంటున్నాననీ మరో ట్వీట్లో లోకేష్ పేర్కొనడం గమనార్హం. ప్రభాస్ అభిమానులే కాదు, టీడీపీ శ్రేణులూ ఈ సినిమాని చూడాలనీ, ఇలాంటి కథనాలకు అదే చెంపపెట్టు అనీ లోకేష్ అభిప్రాయపడ్డారు. దాంతో ఒక్కసారిగా ప్రబాస్ అభిమానుల నుంచి నారా లోకేష్‌కి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.
అనూహ్యంగా ప్రభాస్ అభిమానులు సైతం సదరు వెబ్సైట్ మీద విరుచుకుపడిపోతున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, వైసీపీ అనుకూల వర్గం సదరు కథనం పట్ల సానుకూలంగా స్పందిస్తోంది. నారా లోకేష్‌పై షరామామూలుగానే సెటైర్లతో విరుచుకుపడుతోంది. ఇదే ప్రభాస్‌తో షర్మిలకు లింకులు కట్టి ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా.? అని వైసీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు. తన పట్ల జరుగుతున్న సోషల్ దుష్ప్రచారంపై గతంలో జగన్ సోదరి షర్మిల తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
How low and ugly can you get Great Andhra? Shame on the pseudo journalist who wrote these blatant lies!! How are you even able to eat with the money earned from caste divisions and spreading hatred?? Don’t you have any conscience? https://t.co/xNAsFEeaSO
— Lokesh Nara (@naralokesh) August 19, 2019
662900 895058Excellent post even so , I was wanting to know should you could write a litte a lot more on this topic? Id be very thankful should you could elaborate a little bit further. Bless you! 394464
984539 6232You created some decent factors there. I looked on the internet for the dilemma and located most individuals will go along with along with your internet site. 38417