Switch to English

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గత వారం రోజులుగా సగటున 900 కేసులకు పైనే తెలంగాణలో నమోదవుతున్నాయి. ఇందులో గ్రేటర్‌ హైద్రాబాద్‌ వాటానే అత్యధికం. గ్రేటర్‌ హైద్రాబాద్‌పై కరోనా పంజా విసురుతోంది. 800 కేసుల పైన గ్రేటర్‌ హైద్రాబాద్‌లోనే కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‘మళ్ళీ లాక్‌డౌన్‌..’పై సంకేతాలు ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే, నగరవాసి సొంతూరు వైపు ఆలోచించక తప్పడంలేదు. కానీ, ఎన్నాళ్ళు.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ విషయమై ప్రభుత్వం ఈపాటికే స్పష్టత ఇచ్చి వుండాలి. ఓ వారం రోజులో, పది రోజులో లాక్‌డౌన్‌ వుంటుందని చెప్పొచ్చు. కానీ, అదీ చెప్పడంలేదు. ఇంకోపక్క కరోనా టెస్టులు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా, టెస్టుల సంఖ్య పెరిగిన పరిస్థితి కన్పించకపోవడం గమనార్హం.

తాజాగా, ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా టెస్టుల్ని నాలుగు రోజులపాటు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో, సగటు హైద్రాబాదీ మరింత ఆందోళన చెందుతున్నాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతే.. బోర్డర్‌లో పరీక్షలు చేస్తారు.. అదే కాస్త బెటర్‌..’ అన్న భావన చాలామంది హైద్రాబాదీల్లో వ్యక్తమవుతోందంటే.. తెలంగాణ ప్రభుత్వంపై సగటు హైద్రాబాదీ ఎంతలా నమ్మకం కోల్పోయాడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. కానీ, కోటి మంది జనాభా వున్న గ్రేటర్‌ హైద్రాబాద్‌లో, ప్రభుత్వాసుపత్రుల వైపు వెళ్ళేది ఎంతమంది.? ఆంధ్రప్రదేశ్‌లో అయితే కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.

మొత్తమ్మీద, తెలంగాణలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అందునా హైద్రాబాద్‌లో పరిస్థితులు మరీ దయనీయం. ‘గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో వుండడం కంటే, జిల్లాల్లో సొంతూళ్ళకు వెళ్ళిపోవడం నయం..’ అని ఆయా ప్రాంతాల నుంచి హైద్రాబాద్‌కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డవారు అభిప్రాయపడ్తుండడం గమనార్హం. ఇంత గందరగోళం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏరీ ఎక్కడ.? మీడియా ముందుకొచ్చి జనాలకు ఆయన ఇదివరకటిలా భరోసా ఇవ్వడంలేదెందుకు.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...