కేరళ హైకోర్టులో ఒక రేప్ కేసు విచారణ జరుగుతోంది. నింధితుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారంకు పాల్పడ్డట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో జరుగుతున్న సమయంలో నింధితుడు కొత్త వాదన తీసుకు వచ్చాడు. తాను బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమే. కాని అంగ ప్రవేశం జరగలేదు. కనుక దాన్ని రేప్ గా పరిగణించవద్దంటూ కోరాడు. అతడి వ్యాఖ్యలకు కోర్టు సీరియస్ అయ్యింది.
స్త్రీ శరీరం పై శారీరకంగా ఇబ్బంది పెట్టడం అత్యాచారం కిందకే వస్తుంది. అంగ ప్రవేశం జరగనంత మాత్రాన దాన్ని అత్యాచారం కాదని అనలేమని హైకోర్టు జస్టీస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక అమ్మాయిని అలాంటి పరిస్థితికి తీసుకు వెళ్లారు అంటే అది ఖచ్చితంగా అత్యాచారం అవుతుంది. కనుక అతడికి అత్యాచారం కేసులో విధించే శిక్షను విధించబోతున్నట్లుగా కోర్టు వర్గాలు ప్రకటించారు. అంగ ప్రవేశం జరగనంత మాత్రాన అత్యాచారం కాకుండా పోదు అంటూ కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం గా నిలువబోతుంది.
40704 364948very nice post, i undoubtedly genuinely like this superb site, carry on it 56481