Switch to English

కేసీఆర్ కి మోదీ వార్నింగ్ బెల్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుపై అకస్మాత్తుగా ఐటీ దాడులు జరగడం వెనుక కారణాలు ఏంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని, కేసీఆర్ కి ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్ బెల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇప్పటినుంచే తన కార్యాచరణ అమల్లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ మధ్య అగాథం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. అయితే, ఇదంతా మోదీ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని విపక్షాలు ఆరోపించాయి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపించాయి. ఎన్నికల తర్వాత తిరుగు లేని మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ సైలెంట్ అయ్యారు.

అప్పటి నుంచి మోదీతో కేసీఆర్ సంబంధాలు కూడా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగినా మోదీ ఇవ్వని పరిస్థితికి సంబంధాలు క్షీణించాయి. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం పలకడానికి కేసీఆర్ ప్రయత్నించినా, ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తెలంగాణలో బలోపేతం అయ్యే క్రమంలోనే కేసీఆర్ ను మోదీ దూరంగా ఉంచుతున్నారనే ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆపరేషన్ తెలంగాణలో రెండో అంకానికి బీజేపీ తెరలేపింది. తొలుత టీఆర్ఎస్ ఆర్థిక మూలాలను దిగ్బంధం చేయాలని నిర్ణయించి, ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీలకు డబ్బు చిక్కకుండా, లోపల ఉన్నదాన్ని బయటకు తీయకుండా చేయడంలో టీఆర్ఎస్ విజయవంతమైంది. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ అనుసరించనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆర్థికపరమైన అండ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అందులో భాగంగానే గురువారం అకస్మాత్తుగా మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రామేశ్వరరావుపై ఐటీ దాడులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది కచ్చితంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్న దాడులే అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ను అన్ని వైపుల నుంచీ దిగ్బంధనం చేసి తాను పాగా వేయాలన్నదే బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

3 COMMENTS

  1. 414533 337532Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this website is 1 thing thats wanted on the web, somebody with a bit of originality. valuable job for bringing something new to the internet! 571977

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...