Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: మాస్కులేసుకోకపోతే చంపేస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్కు ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకరి నుంచి ఇంకొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం వుంది గనుక.. మాస్కు ధరించాల్సిందే. ‘మాస్కు ధరించనివాడిని పశువుగా పరిగణించాలి..’ అని ఓ సినీ దర్శకుడు ఇటీవల ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అందులో నిజం లేకపోలేదు. అలాగని, మాస్కు ధరించకపోతే చంపేస్తారా.? పైగా, ఈ దారుణం ఓ పోలీసు అత్యుత్సాహం కారణంగా జరగడమా.?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా వివిధ ఘటనల్లో పోలీసుల అత్యుత్సాహం అభాసుపాలవుతోంది. న్యాయస్థానాల్లో మొట్టికాయలు ఎదురవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడికి గుండు కొట్టించేశారు పోలీసులు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి, బాధ్యుల్ని సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. ఇక, తాజాగా మాస్కు పెట్టుకోలేదన్న కారణంగా ఓ యువకుడిపై ఓ పోలీస్‌ దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

మొన్నటికి మొన్న విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌పై పోలీసులు దాడి చేసిన ఘటన పెను సంచలనం సృష్టించింది. న్యాయస్థానం మొట్టికాయలేయడమే కాదు, ఈ ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించింది. ఎందుకిలా.? మరీ ముఖ్యంగా దళితులపై ‘కొందరు’ పోలీసుల అత్యుత్సాహం ఎందుకు కన్పిస్తోంది.? మాస్కు విషయానికే వద్దాం.! అధికార పార్టీకి చెందిన చాలామంది నేతలు మాస్కులు లేకుండా జనాల్లోకి వచ్చేస్తున్నారు. కనీసం, వైసీపీ నేతలెవరికైనా పోలీసులు జరీమానాలు విధించారా.?

అంతెందుకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సైతం మాస్క్‌ వేసుకోకుండా తిరుగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్యమంత్రికి ఒక నీతి.. దళిత యువకుడికి ఇంకో నీతి.? ఇదేం ప్రజాస్వామ్యం.?’ అంటూ ప్రకాశం జిల్లాలో పోలీస్‌ దాష్టీకానికి బలైపోయిన యువకుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ‘మాస్క్‌ ధరించకపోతే దేశ ప్రధానికే జరీమానా విధించారు..’ అంటూ ఆ మధ్య ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. మాస్కు ధరించాల్సిందే.. ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ, ఇక్కడ పోలీసుల అత్యుత్సాహమే విమర్శలకు తావిస్తోంది. ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఇంకో నీతి.. ఇది అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...