Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: 3 కాదు, ఏపీకి 5 రాజధానులు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా అమరావతి ఎంపికైంది. చంద్రబాబు ‘ఒక్కటే’ రాజధాని అన్నారు కాబట్టి, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారిపోవడం అనేది దేశ చరిత్రలో ఎక్కడన్నా వుందా.? ఆ పైత్యం, ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. ఎందుకంటే, ఇక్కడి నీఛ, నికృష్ట రాజకీయాలు అలాంటివి.

ఈ దిక్కుమాలిన రాజకీయాల కారణంగానే.. పాత పేరుతో కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలతో ఏర్పడింది.. హైద్రాబాద్‌ని కోల్పోయింది. అయినా, ఆంధ్రప్రదేశ్‌ మీద ఏపీకి చెందిన రాజకీయ నాయకులకే ‘కసి’ ఇంకా చల్లారినట్లు లేదు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేస్తోంది ప్రస్తుత అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

మూడు రాజధానులు కాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు 30 రాజధానులైనా కట్టుకోవచ్చు. కానీ, ఐదేళ్ళకోసారి రాజధాని మారిపోతే ఎలా.? చంద్రబాబు హయాంలో ప్రకటితమైన రాజధాని అమరావతి స్థానంలో ఇప్పుడు మూడు రాజధానులొస్తున్నాయి. అందులో అమరావతి కూడా ఒకటి. అంటే, అదనంగా రెండు రాజధానులు రాబోతున్నాయన్నమాట. రేప్పొద్దున్న.. అంటే, 2020 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే ఐదు రాజధానులొస్తాయా.? అంతకు మించి.. ఏడు రాజధానుల చర్చ తెరపైకొస్తుందా.?

ఇప్పుడున్న జిల్లాల సంఖ్యని 25 చేస్తున్నారు గనుక.. ఏమో, పైత్యం పతాక స్థాయికి చేరి, కొత్త ప్రభుత్వం పదో పాతికో రాజధానుల్ని, వందో రెండొందలో జిల్లాల్నీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లోటు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రం.. అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం.. ఇంకా విభజన పంపకాలు తేలని రాష్ట్రంతో ఈ నికృష్ట రాజకీయ క్రీడ ఏంటో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దిక్కెవరో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...