Switch to English

Jr.Ntr Birthday Specials: ‘ఆది’.. నటనలో అణు విస్ఫోటనం చూపిన Jr.ఎన్టీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Jr.Ntr Birthday Special: హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. ఫ్యాన్స్, బిజినెస్, ఫిల్మ్ మేకింగ్, క్రేజ్, ఇమేజ్, ప్రేక్షకాదరణ మొత్తం మారిపోతాయి. కొందరికి మాత్రమే దక్కే అంతటి ఇమేజ్ ను అనతికాలంలోనే ఒడిసిపట్టి.. టాలీవుడ్ కి సరికొత్త మాస్ హీరోగా అవతరించాడు జూనియర్ ఎన్టీఆర్. కామ్ గా కనిపించే ఎన్టీఆర్ లో అంతటి ఫైర్ ఉందని.. సరైన పాత్ర పడితే ఉగ్ర నరసింహ అవతారమే అని నిరూపించిన సినిమా ‘ఆది’. బాల నటుడిగా చేసిన రెండు సినిమాలు మినహాయిస్తే.. అప్పటికి హీరోగా చేసిన మూడు సినిమాల్లో స్టూడెంట్ నెంబర్ 1 హిట్. అయితే.. ఆదితో ప్రేక్షకులు, ఇండస్ట్రీ, ట్రేడ్ ఒక్కసారిగా ఎన్టీఆర్ వైపు చూశారు. ఎన్టీఆర్ లో అణు విస్ఫోటనం చూపిన సినిమాగా ఆది నిలిచిపోయింది. దీంతో ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో అయిపోయాడు.

రాయలసీమ పవర్..

టాలీవుడ్ మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ కు ఇదే మొదటి సినిమా. తనలో ఉన్న కసిని స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ఎన్టీఆర్ లో చూపించాడు వినాయక్. అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా, చిన్నప్పుడే బాంబులతో ఆడుకున్నా, తొడ కొట్టడం, మంచినీళ్లు తాగుతుంటే కళ్లలో నిప్పు.. వంటి సీన్లకు ధియేటర్లు మోత మోగిపోయాయి. మొత్తంగా సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయినా.. నిజంగా ఎన్టీఆరే రాయలసీమలో అడుగుపెట్టాడా.. అనేంతగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు. అప్పటికి 20ఏళ్లు కూడా నిండని కుర్రాడు తెరపై ఓ విధ్వంసమే సృష్టించడంతో కొత్తగా ఫ్యాన్స్, నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం. దీంతో ఎన్టీఆర్ సినిమా బిజినెస్ లెక్కలు మారాయి. ఎన్టీఆర్ తో మాస్ సినిమాల కోసం దర్శక, నిర్మాతలు, రచయితలు ఆలోచించే స్థాయికి వెళ్లిపోయాడు.

పెరిగిన అంచనాలు..

ముందు సినిమాల్లో యాక్షన్ ఉన్నా ఎన్టీఆర్ లో ఉన్న ఫైర్ అని నిరూపించిన సినిమా మాత్రం ఆది. డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్ కు తిరుగులేకుండా పోయింది. మాస్ పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం కామన్ అయిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి వంశం మూడో తరం హీరోగా ప్రతిష్ఠ పెంచాడు. తర్వాత వచ్చిన అల్లరి రాముడుపై ఏర్పడిన భారీ అంచనాలు సినిమాకు కాస్త ప్రతికూలమైనా.. పంచెకట్టులో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. నాగ సినిమాలో యువత ప్రతినిధి పాత్రలో యూత్ ని ఆకట్టుకుని తనదైన ముద్ర వేశాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ లో ఉన్న ఫైర్ ను ఎంతగా రగిలిస్తే అంత వెలుగు వస్తుందనేంతగా ఆయన తర్వాతి సినిమాలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...