Switch to English

వైఎస్‌ జగన్‌ ‘నో డిక్లరేషన్‌’: ఇది వైసీపీ పొలిటికల్‌ ప్లాన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

గతంలోనూ వైఎస్‌ జగన్‌ తిరుపతికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. ఆ నిబంధనల్లో ‘డిక్లరేషన్‌’ కూడా ఒకటి. నిజానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీటీడీ నిబంధనల్ని వైఎస్‌ జగన్‌ గౌరవించి తీరాలి. కానీ, అసలాయనకు ఆ ఉద్దేశ్యం లేదని ఇంకోసారి తేలిపోయింది. డిక్లరేషన్‌ ఇస్తేనే, వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం వున్నట్లా.? అన్నది వేరే చర్చ.

అసలు, ఈ వివాదం ఎక్కడ మొదలైంది.? అంటే, తాజా వివాదానికి కేంద్ర బిందువు ఎవరో కాదు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ‘డిక్లరేషన్‌ అవసరం లేదు’ అని జనరల్‌ స్టేట్‌మెంట్‌ ఆయన పాస్‌ చేశాకే వివాదం ముదిరి పాకాన పడింది. వివాదం పెద్దదయ్యాక, ‘నా ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకున్నా.. అప్పటికే జరగాల్సిన పొలిటికల్‌ డ్యామేజీ జరిగిపోయింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి. మంత్రి కొడాలి నాని ‘హద్దులు దాటి’ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేతలు కొందరు అదే బాటలో నడవడం.. ఇవన్నీ వైసీపీ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసేశాయి.

ఈ పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్‌పై సంతకం పెట్టి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. అయితే, ‘ఇదంతా పక్కా ప్లానింగ్‌తో వైసీపీ చేసింది’ అని టీడీపీ ఆరోపిస్తోంది. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాల్సిన వైసీపీ, ఈ వివాదం పేరు చెప్పి మొత్తం వ్యవహారాన్ని ‘సైడ్‌ ట్రాక్‌లోకి నెట్టేసింది’ అని తీరిగ్గా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. ఎంతైనా 60-40 బంధం కదా.. అన్నీ టీడీపీకి అలా తెలిసిపోతుంటాయంతే.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. ఎక్కడా ప్రత్యేక హోదా చర్చ రాలేదు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు సహా, విభజన చట్టానికి అనుగుణంగా రావాల్సిన నిధుల గోల కూడా పెద్దగా వినిపించలేదు. ఎలా చూసుకున్నా, ఇక్కడ ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ సుస్పష్టం. అమరావతి భూములపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం కూడా వైసీపీ పొలిటికల్‌ గేమ్ అనే భావించాలేమో.

అయితే, ఇంతలా ప్లాన్‌ చేసి ‘డిక్లరేషన్‌’ వివాదాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ ఏం లాభపడినట్లు.? లాభం లేదు సరికదా, వైసీపీ రాజకీయంగా చాలా నష్టపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న వేళ, వైసీపీ.. ‘డిక్లరేషన్‌’ పేరుతో ఆడిన డ్రామా, సృష్టించిన రగడ.. ఇవన్నీ వైసీపీకి ‘చారిత్రక తప్పిదం’గా మారనున్నాయన్నది నిర్వివాదాంశం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...