వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం అయిన ఖర్చుల్ని భరించాల్సిందిగా, అదే సమయంలో ఆయన కుటుంబానికి నివాస స్థలం అందించాల్సిందిగా వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
తీరా చూస్తే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి వైద్య చికిత్సకయ్యే ఖర్చుల్ని చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ చేసుకుంటున్న ప్రచారాన్ని తప్పు పట్టలేం. రాజకీయ పార్టీలన్నాక, రాజకీయాలు చేయాల్సిందే. పుట్టుక చుట్టూ రాజకీయం, చావు చుట్టూ రాజకీయం.. అసలు రాజకీయం లేనిదెక్కడ.?
కానీ, వైసీపీ అనుకూల మీడియాలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సహాయంలా కాకుండా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన జేబుల్లోంచి తీసి ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సినిమా పాటకి సీతారామ శాస్త్రి పాటల రచయితగా చేసిన సేవలకుగాను ఆయన్ని ఎంతలా గౌరవించుకున్నా అది ఎక్కువ కాదు. ప్రభుత్వాలు ఈ విషయమై ఉదారంగా స్పందించాల్సిందే.. అది ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతులకు దక్కిన గౌరవమే అవుతుంది.
కానీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఆయన ఆర్థికంగా ఉన్నత స్థానంలోనే వున్నారు. కొత్తగా ఆయనకు ఆర్థిక సాయం అవసరం లేదు. నివాస స్థలం విషయంలోనూ అంతేనని సినీ పరిశ్రమలోనే చర్చ జరుగుతోంది. సిరివెన్నెల అభిమానులైతే, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిరివెన్నెల పేరుతో అవార్డుల్ని ప్రతియేటా అందించాలని కోరుకుంటున్నారు. అబ్బే, అలా చేస్తే.. రాజకీయంగా అధికారంలో వున్నవారికి ఆశించిన పబ్లిసిటీ దొరకదు కదా.?
సిగ్గు, లజ్జా, మానాభిమానాలు లేని ఆ అక్కుపక్షి, టిష్యూపేపర్ లలోని బానిస సన్నాసుల్లారా కరోనా మొదటి వేవ్ సమయంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి తన కష్టార్జితం 5 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరులకు అవసరం లేదురా ఇటువంటి దిక్కుమాలిన భజనలు, చీప్ పబ్లిసిటీ. మీ అవినీతి చక్రవర్త, ఆర్ధిక నేరస్తుడు ఏ1 కి మాత్రమే కావాలి శవ ఊరేగింపులు.