నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు భరోసా కేంద్రాలు చాలా బాగా పనిచేస్తున్నాయట.
ఇకనేం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా కేంద్ర సాయం అవసరం లేదన్నమాట. నీతి అయోగ్ ప్రశంసలపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని అధికార పార్టీ ఉబ్బితబ్బిబ్బయిపోతోంటే, జనం మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు నీతి అయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటించిందా.? గ్రామ స్థాయిలో సమస్యల్ని నీతి అయోగ్ తెలుసుకుందా.? గ్రామాల్లో సమస్యల సంగతి దేవుడెరుగు.. ఆయా గ్రామాలకు వెళ్ళేందుకు రోడ్లు సరిగ్గా వున్నాయా.? లేదా.? ఇప్పుడీ ప్రశ్నలు సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తరఫున బృందాలు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు, ఆయా ప్రభుత్వాలపై ప్రశంసలు గుప్పించడం కొత్త విషయమేమీ కాదు. కానీ, ఫలానా విభాగంలో లోటుపాట్లున్నాయని చెబితే, వాటిని సరిదిద్దుకోవాల్సి వుంటుందన్న కనీస ఇంగితమే ఇటీవలి కాలంలో కేంద్ర బృందాలకు కొరవడుతోందన్న విమర్శ వుంది.
సరే, రాష్ట్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కేంద్రం చెప్పుకోవాలి గనుక, ఇదంతా తమ ఘనతేనని కేంద్రం జబ్బలు చరచుకోవాలి గనుక.. ఆయా కేంద్ర బృందాలు ఈ తరహా ప్రశంసలు గుప్పిస్తుంటాయన్నది ఇంకో వాదన.
నిజానికి, నీతి అయోగ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయాల్సి వుంది. ప్రత్యేక హోదా ఇస్తే, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనీ.. రాష్ట్రానికి దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు అవసరమనీ, పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని కూడా అత్యవసరమనీ నీతి అయోగ్ వ్యాఖ్యానించి వుండాల్సింది.
రాష్ట్ర గవర్నర్ కరోనా బారిన పడితే, హుటాహుటిన హైద్రాబాద్ తరలించాల్సి వచ్చిందంటే, రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగినట్లు.?
Wer erkennen wird eine Reihe von weitere Dollars sollte nehmen Sie sich Zeit bis lernen zum Finden Seiten Das kann bezahlen.