‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ మీదనే గుస్సా అయిపోయారు అదే పార్టీకి చెందిన ఎంపీ. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీల ఘనత.
అధికార వైసీపీకి చెందిన ఎంపీలు, పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, పరస్పరం చేసుకున్న విమర్శలు.. అంతిమంగా రాష్ట్రం పరువు తీసేసిన వైనం.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న మాట వాస్తవం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు, మళ్ళీ కొత్తగా రాష్ట్ర దుస్థితిపై మన రాష్ట్ర ఎంపీలే పార్లమెంటు సాక్షిగా రచ్చ చేసుకోవడమెందుకు.? పైగా, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇలా తమ రాష్ట్రం పరువుని బజార్న పడేసుకోవడం హాస్యాస్పదమే.
అన్నట్టు, ఆ ఇద్దరు ఎంపీలలో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. నిజానికి, రఘురామ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. రాష్ట్ర సామర్థ్యాన్ని మించి అప్పులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు, ఓ ఎంపీ.. తన రాష్ట్ర పరిస్థితిపై పార్లమెంటు సాక్షిగా ఆవేదన వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టలేం.
మరి, తమ పాలన చాలా ఘనం.. అని చెప్పుకుంటోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని చెప్పుకుంటే ఎలా.? రఘురామ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ ఇచ్చే ప్రయత్నంలో వైసీపీ ఎంపీలు, జగన్ సర్కారు పరువు తీసేసి, రాష్ట్రం పరువుని కూడా బజార్న పడేశారు.
574649 126492Some truly exceptional articles on this internet web site , thankyou for contribution. 912266
362052 328283Whoah this blog is magnificent i genuinely like reading your articles. Keep up the good paintings! You realize, lots of persons are looking round for this information, you can aid them greatly. 445945
619286 228901Hello! I merely want to make a enormous thumbs up with the wonderful info youve here during this post. We are returning to your weblog for additional soon. 114363
149860 350809Incredibly finest man toasts, nicely toasts. is directed building your personal by way of the wedding celebration as a result are supposed to try to be witty, amusing and consequently unusual as well as. greatest mans speech 522199
822278 448800Simply a smiling visitant here to share the adore (:, btw outstanding pattern . 286680