Switch to English

టీమిండియాకు కాషాయం కలిసి రాలేదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో అప్రతిహాతంగా దూసుకుపోతున్న టీమిండియా తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ కోసం కొత్త జెర్సీలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆ రంగు కలిసి రాలేదనే చర్చ జరుగుతోంది. మెన్ ఇన్ బ్లూకి ఈ కాషాయ రంగు అస్సలు కలిసి రాలేదంటూ కొందరు కొత్త భాష్యం చెబుతున్నారు.

భారత్ తోపాటు ఇంగ్లండ్ జట్టుది కూడా నీలం రంగు జెర్సీ కావడంతో ఒక జట్టు జెర్సీ మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. ఇంగ్లండ్ ఆతిథ్య జట్టు కాబట్టి వారి జెర్సీని అలాగే ఉంచి టీమిండియా జెర్సీ మార్చుకోవాలని సూచించింది. దీంతో మెన్ ఇన్ బ్లూ కాస్తా మెన్ ఇన్ కాషాయంగా మారి ఈ మ్యాచ్ లో బరిలోకి దిగారు. అంతకుముందు ఈ జెర్సీపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేస్తున్నారని, చివరకు భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగు కూడా కాషాయంగా మార్చేశారని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.

జెర్సీకి ఈ రంగు నిర్ణయించడం వెనుక బీజేపీ ఉందని ఆరోపణలు చేశారు. వీటిని బీజేపీ తిప్పికొట్టినప్పటికీ, ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడంతో కాషాయ కలర్ పై కొత్త అనుమానాలు తలెత్తాయి. జెర్సీ రంగు మారడంతో టీమిండియా రాత కూడా మారిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వస్తున్నాయి. ఎప్పటిలాగే పాత జెర్సీతో ఆడి ఉంటే, గెలుపు మనదేనని.. జెర్సీ మార్చడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందంటూ పలువురు క్రీడాభిమానులు వాపోతున్నారు.

వాస్తవానికి ఇలాంటి సెంటిమెంట్లు క్రీడాకారులకు కొత్త కాదు. తమకు ఫలానా నెంబర్ జెర్సీ అయితేనే లక్కీ అని నమ్మేవారు ఎందరో ఉన్నారు. ఆటలో రాణించడానికి ప్రతిభతోపాటు అదృష్టం కూడా కలిసి రావాలని నమ్ముతూ ఉంటారు. ఇదే వరల్డ్ కప్ లో ఈ జెర్సీ సెంటిమెంట్ ను శ్రీలంక కూడా విశ్వసించింది. టోర్నీ ఆరంభంలో ఓటములు, మ్యాచ్ రద్దులతో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంక.. ఇంగ్లండ్ తో మ్యాచ్ కోసం పసుపు రంగు జెర్సీతో బరిలోకి దిగి విజయం సాధించింది.

దీంతో ఆ జెర్సీ తమకు లక్కీ అని భావించి, తదుపరి మ్యాచ్ లలో కూడా అదే జెర్సీతో ఆడేందుకు ఐసీసీని అనుమతి కోరింది. అయితే, తదుపరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం గమనార్హం. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ, ఇలాంటి నమ్మకాలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...