ఇటివల గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పారు. ‘నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడుంటే నన్ను క్షమించండి. ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. దర్శకుడు వివేక్ కోపాన్ని అర్ధం చేసుకోగలను’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ విషయాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ లాపిడ్ ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడు అని అన్నారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇఫి వేడుకలకు నడవ్ లాపిడ్ జ్యూరీ హెడ్ గా ఉన్నారు. వేడుకల చివరి రోజున ది కశ్మీర్ ఫైల్స్ పై స్పందిస్తూ.. ‘ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఇదొక అసభ్యకర సినిమా. ప్రచారం కోసం మాత్రమే తీసింది’ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.