Switch to English

Bedurulanka 2012: ‘బెదురులంక 2012’తో నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను – హీరో కార్తికేయ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Bedurulanka 2012: యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ విశేషాలు…

హీరో కార్తికేయ మాట్లాడుతూ ”నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. ‘బెదురులంక 2012’ వేరు. ‘ఆర్ఎక్స్ 100’తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి ‘బెదురులంక 2012’తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది. మా వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని క్లాక్స్ నమ్మాడు. మేం ఇద్దరం ఈ సినిమా చేయగలమని నిర్మాత బెన్నీ నమ్మారు. న్యూ ఏజ్ ప్రొడ్యూసర్ ఆయన. బెన్నీ గారికి థాంక్స్. సినిమాలో కథానాయికగా ముందు నేహా శెట్టిని అనుకోలేదు. బెన్నీ గారు ఆమె పేరు చెబితే మేం డౌట్ పడ్డాం. మా భయం కన్నా ఆమె ఎక్కువ భయపడిందని షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది. రాధికా కనిపించకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని నటించింది. తన క్యారెక్టర్ వరకు కాకుండా సినిమాను చూసింది. మణిశర్మ గారి ‘రామా చిలకమ్మా’ సాంగ్ వల్ల నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఎంతో మంది హీరోలతో, ఎన్నో జానర్ సినిమాలు చేసినప్పటికీ… ఈ తరహా సినిమాను ఎప్పుడు చేయలేదని, తన మొదటి సినిమాకు పని చేసినట్లు చేస్తున్నానని మణిశర్మ గారు చెప్పారు. నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు నేను డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ మనసు పెట్టి పని చేశారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. నేను ఈ సినిమా చేయడం లక్కీగా ఫీలవుతున్నా. నా సినిమాలు ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ప్రతి సినిమాకు కష్టపడుతున్నా. ఈ సినిమాకు రిలాక్స్ కావచ్చు. ఇంతకు ముందు మిస్ అయినవి వడ్డీతో కలిపి రావచ్చు. నిజాయతీగా కొత్త సినిమా తీశాం. దీన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే… ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మరింత ఉత్సహం వస్తుంది. సినిమాపై మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 24వ రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. మరిన్ని బ్లాక్ బస్టర్స్ చేయడానికి ఇంకా కష్టపడతా” అని అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”బెన్నీ గారు సెన్సిబుల్ కథలు ఎంపిక చేస్తారని అందరూ చెప్పారు. నేను సెన్సిబుల్ కథ రాస్తే సరిపోదు. దాన్ని గుర్తించి, అర్థం చేసుకోవాలనే వ్యక్తి కావాలి. నేను ఈ కథను 7, 8 ఏళ్లుగా చాలా మంది నిర్మాతలకు చెప్పా. వాళ్ళందరూ ఏవేవో చూశారు. బెన్నీ గారికి చెప్పినప్పుడు కోర్ పాయింట్ అర్థం చేసుకున్నారు. నేను చాలా మంది హీరోలకు కూడా కథ చెప్పా. తమకు తగ్గట్టు మార్చమని అడిగారు. కార్తికేయకు కథ చెప్పినప్పుడు బెన్నీ గారిలా కథను అర్థం చేసుకున్నారు. కార్తికేయ లాంటి హీరో, బెన్నీ గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. మణిశర్మగారి సంగీతం, వినోద్‌ గారి సౌండ్‌ డిజైనింగ్‌ అద్భతం” అని అన్నారు.

‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ మల్లిడి మాట్లాడుతూ ”బెన్నీకి కంగ్రాట్స్ చెప్పాలి. ‘కలర్ ఫోటో’కి కొత్త కాన్సెప్ట్ నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. అలాగే, ఈ సినిమాకు కూడా కొత్త దర్శకుడిని లాంఛ్ చేస్తున్నారు. ‘బెదురులంక 2012’కు ‘కలర్ ఫోటో’ కంటే ఎక్కువ డబ్బులు, అవార్డులు రావాలి. కార్తికేయ, నేహా శెట్టి… ఇంకా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ ”ప్రేక్షకులు అందరూ ‘డీజే టిల్లు’లో తెలంగాణ అమ్మాయి రాధికను చూశారు. ఇప్పుడు ‘బెదురులంక 2012’లో ఆంధ్ర అమ్మాయి చిత్రను చూడబోతున్నారు. నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మంచి సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. పల్లెటూరి అమ్మాయిగా నటించగలనా? లేదా? అని దర్శకుడు క్లాక్స్ సందేహించినా… నిర్మాత బెన్నీ గారు సజస్ట్ చేశారు. వాళ్ళిద్దరికీ థాంక్స్. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ 2018లో విడుదలైంది. స్నేహితులతో కలిసి వెళ్ళా. సినిమా నాకు బాగా నచ్చింది. అప్పుడు ఆ హీరోతో ‘బెదురులంక 2012’ చేస్తానని అనుకోలేదు. తను మంచి కో స్టార్, ఫ్రెండ్” అని అన్నారు.

చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ… ”హీరో కార్తికేయ చాలా ప్రొఫెషనల్. క్లాక్స్ కొత్త కథను చెప్పాడు. మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది” అని అన్నారు.

‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ ”నేను ‘కలర్ ఫోటో’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాక బెన్నీ అన్నకు నేరేషన్ ఇచ్చా. నాకు ఆయన సెన్సిబిలిటీస్ చాలా ఇష్టం. ఆయన ఇచ్చిన సజెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. సీన్ చూసి ఆయన చిన్న స్మైల్ ఇస్తే బాగా వచ్చిందని అర్థం. ఆయన తర్వాత ఏం చేస్తారు? అని ఆలోచించా. ‘బెదురులంక 2012’ ఐడియా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఊహించిన దానికంటే ట్రైలర్ చాలా బావుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మణిశర్మ గారితో నేను షార్ట్ ఫిలింకి పని చేశా. ఏమీ లేని సన్నివేశాలకు అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఏ స్థాయిలో సంగీతం అందించారో ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ”బెన్నీకి గుడ్ లక్. అతనితో కలిసి ‘కలర్ ఫోటో’ ప్రొడ్యూస్ చేశా. తను ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. కచ్చితంగా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్తికేయ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ప్రతి పాట నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. బ్లాక్ బస్టర్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.

‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ”డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న బెన్నీ గారికి థాంక్స్. నేను, క్లాక్స్ 8 ఏళ్లుగా ఫ్రెండ్స్. ‘విరూపాక్ష’లో అతని ఇన్ పుట్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కథ నాలుగైదేళ్ళ క్రితం తెలుసు. క్లాక్స్ మంచి దర్శకుడు అవుతాడు. అతనికి చాలా క్లారిటీ ఉంది. కార్తికేయ, నేహా శెట్టి పెద్ద హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.

ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ”మంచి క్యారెక్టర్స్ కోసం ఏడాది గ్యాప్ తీసుకుందామని షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ బిజీ అయిపోయా. ఇక్కడ నా స్నేహితులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దర్శకుడు క్లాక్స్ ఈ కథతో వచ్చారు. మంచి క్యారెక్టర్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. వెండితెరకు దూరం కాకూడదని మళ్ళీ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టా” అని అన్నారు.

నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ”కార్తికేయను చూస్తే నాకు ఇంగ్లీష్ హీరో గుర్తుకు వస్తాడు. ఆయన మంచి కథ ఎంపిక చేసుకున్నాడు. ఆయన నటనా భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నా ఆరోగ్యం అంత బాలేదు. నైట్ షూట్స్ కష్టం, రాత్రి 9 గంటల తర్వాత షూటింగ్స్ చేయలేనని అంటే… 8.45కి పంపించేవాడు. క్లాక్స్ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మనుషుల్లో బలహీనతలు, స్వార్థం, దిగజారుడు తనం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆయన స్టైల్ లో ఈ సినిమాలో చూపించాడు. అద్భుతమైన కథ. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ చేశా” అని అన్నారు.

171 COMMENTS

  1. Undeniably believe that which you said. Your favorite reason seemed
    to be on the web the simplest thing to be aware of. I say to you, I certainly
    get irked while people consider worries that they just don’t know about.

    You managed to hit the nail upon the top and
    defined out the whole thing without having side-effects , people could take a signal.
    Will likely be back to get more. Thanks

  2. LEVEL4D RTP Live Slot Pola Slot Gacor Hari Ini Info Bocoran Jam
    Gacor Slot Online Pragmatic rtp level4d rtp pragmatic play rtp pgsoft
    rtp habanero rtp microgaming rtp spade gaming rtp joker123 Sеlаmаt dаtаng dі ѕіtuѕ уаng mеnуаjіkаn іnfо ѕерutаr bосоrаn jаm gасоr slot gacor Prаgmаtіс, Hаbаnеrо, PGѕоft, Mісrоgаmіng serta
    Sраdеgаmіng RTP LIVE & POLA SLOT PRAGMATIC HARI INI

  3. Howdy terrific website! Does running a blog such as this
    take a massive amount work? I’ve virtually no understanding of computer programming but I had
    been hoping to start my own blog soon. Anyways, if you have any suggestions or techniques for new
    blog owners please share. I know this is off topic however I simply wanted to ask.

    Thanks!

  4. First of all I would like to say awesome blog!

    I had a quick question that I’d like to ask if you do not mind.
    I was curious to know how you center yourself and clear your thoughts prior to writing.
    I have had difficulty clearing my mind in getting my ideas out there.

    I truly do enjoy writing however it just seems like the
    first 10 to 15 minutes are generally lost simply just trying to
    figure out how to begin. Any recommendations or tips?
    Kudos!

  5. With havin so much content and articles do you ever run into any
    issues of plagorism or copyright infringement? My blog has a lot of completely unique content I’ve either authored myself or outsourced but it appears a lot of it is popping it up all over the web without my authorization.
    Do you know any ways to help protect against content from being stolen? I’d genuinely appreciate it.

  6. hey there and thank you for your info – I have
    definitely picked up anything new from right here. I did however expertise several technical issues using this web site, since I experienced
    to reload the website many times previous to I
    could get it to load properly. I had been wondering if your web host is OK?

    Not that I am complaining, but sluggish loading instances times will sometimes
    affect your placement in google and could damage your high
    quality score if ads and marketing with Adwords. Well I’m adding
    this RSS to my e-mail and can look out for much more of your respective intriguing content.

    Ensure that you update this again soon.

  7. Hey I know this is off topic but I was wondering
    if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.

    I’ve been looking for a plug-in like this for quite some time and was
    hoping maybe you would have some experience with something like
    this. Please let me know if you run into anything.
    I truly enjoy reading your blog and I look forward to your new updates.

  8. Наша бригада профессиональных исполнителей находится в готовности предлагать вам актуальные системы утепления, которые не только гарантируют долговечную защиту от заморозков, но и подарят вашему домашнему пространству оригинальный вид.
    Мы деятельны с новейшими средствами, сертифицируя долгий период службы и прекрасные выходы. Изолирование внешней обшивки – это не только сокращение расходов на обогреве, но и заботливость о окружающей природе. Экологичные подходы, которые мы внедряем, способствуют не только зданию, но и сохранению природных ресурсов.
    Самое главное: [url=https://ppu-prof.ru/]Утепление фасада квартиры снаружи цена[/url] у нас открывается всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое сделает ваш жилище в реальный уютный локал с минимальными расходами.
    Наши работы – это не только изолирование, это созидание пространства, в котором каждый элемент отражает ваш собственный образ. Мы примем все ваши запросы, чтобы осуществить ваш дом еще дополнительно удобным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://www.ppu-prof.ru[/url]
    Не откладывайте дела о своем доме на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш дворец не только более теплым, но и стильнее. Заинтересовались? Подробнее о наших услугах вы можете узнать на нашем сайте. Добро пожаловать в мир благополучия и качественной работы.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...