Switch to English

టిబి స్పెషల్: మీడియా మొఘల్ కి ఇది భావ్యమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

సైన్యం బాగుంటేనే రాజు బాగుంటాడు. తన బాగు కోసం సైన్యాన్ని బలిపెడితే ఆ రాజ్యానికి ఇబ్బందులు తప్పవు. ఇది ఎక్కడైనా వర్తిస్తుంది. పత్రికా రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈనాడు లో ప్రస్తుతం ఇదే జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ్. నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఈనాడు సామ్రాజ్యం కరోనా కారణంగా మూడు నెలలకే విలవిలాడుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సెగ తగిలిన నెలకే ఇతర చిన్న పత్రికల తరహాలోనే ఈనాడు కూడా వ్యవహరించడం మీడియా సర్కిళ్లలో ఆశ్చర్యానికి తావిచ్చింది. ఒక్క నెలకే విలవిలాడే పరిస్థితి ఈనాడుకు వచ్చిందా అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి.

నిజానికి ఈనాడులో ఉద్యోగమంటే అదో బ్రాండ్ అనే తరహాలో ఉండేది. ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక రోజు ముందుగానే సంస్థ ఉద్యోగులకు వేతనాలు వచ్చేవి. అయితే, సాక్షి రాకకు ముందు ఈనాడులో జీతాలు తక్కువగానే ఉండేవి. సాక్షి రాకతో పలువురు ఉద్యోగులు అటువైపు వెళ్లిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాదాపు 25 శాతం మేర వేతనాలు పెంచారు. దీంతో అప్పడు అధిక జీతాల కోసం సాక్షికి వెళ్లినవారికి, సాక్షి కారణంగా జీతాలు పెంచడంతో ఈనాడులో ఉన్నవారికి మంచిరోజులు వచ్చినట్టే అని పాత్రికేయులు సంబరపడ్డారు. తదనంతర కాలంలో వేజ్ బోర్డు సిఫార్సులను కూడా ఈనాడు అమలు చేయాల్సి రావడంతో వేతనాలు మరికొంత పెరిగాయి. అయితే, ఇందుకోసం ఖైరతాబాద్ లో ఉన్న ఈనాడు ఎడిటోరియల్ సిబ్బందిని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చింది. తద్వారా వేజ్ బోర్డు సిఫార్సుల భారం కొంతైనా తగ్గించుకోవచ్చని అలా చేసింది.

ఇది ఇలా ఉంచితే.. కరోనా వేళ సిబ్బందికి లేఆఫ్ ప్రకటించడం మాత్రం మీడియా మొఘల్ గా పేరు పొందిన రామోజీరావుకు ఏమాత్రం భావ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. సంస్థ కోసం కష్టపడి పనిచేస్తున్న తన సైనికులను ఇలాంటి కష్టకాలంలో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొన్నటివరకు ప్రతినెలా 30 లేదా 31నే వేతనాలు ఇచ్చే ఈనాడు.. తాజాగా 8వ తేదీన జీతాలను సిబ్బంది ఖాతాల్లో జమ చేస్తోంది. అది కూడా ఒక్కొక్కరికీ ఒక్కోలా కోత కోస్తోంది. సంస్థలో సిబ్బంది అవసరం ఎంత మేరకో లెక్కగట్టి అన్ని రోజులు మాత్రమే కార్యాలయానికి రావాలని నిర్దేశిస్తోంది. అలా వచ్చిన రోజులకు పూర్తి వేతనం.. లేఆఫ్ లో ఉన్నరోజులకు బేసిక్, డీఏలో కొంత మొత్తాన్ని మాత్రమే ఇస్తోంది. రూ.50వేల వేతనం పొందుతున్న ఉద్యోగికి నెలలో 5 రోజుల లేఆఫ్ ఇస్తే.. అతడికి దాదాపు రూ.5వేలు కోత పడుతోంది. అతడి వేతనం రూ.50వేల అయినప్పటికీ.. బేసిక్ పే తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో కోత పడుతోంది.

ఇక సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మాత్రం లేఆఫ్ లు ఇవ్వడంలేదని సమాచారం. చిన్నాచితకా జీతం ఉన్నవారి నుంచి ఓ మాదిరి సీనియర్ల వరకు కోతలు అమలు చేస్తున్నారు. ఈ లేఆఫ్ లు కూడా అందరికీ ఒకేవిధంగా లేవు. రెండు రోజుల నుంచి పది పన్నెండు రోజుల వరకు ఇది ఉంటోందని తెలుస్తోంది. ఇక జిల్లాల్లో అయితే ఈ కోతలు మరీ భారీగా ఉన్నాయని సమాచారం. ఎడిటోరియల్ కాకుండా మిగిలిని విభాగాల సిబ్బంది మాత్రం దినదిన గండంగా గడుపుతున్నారని అంటున్నారు. ఈనాడుకు అనుబంధంగా ఉన్న పలు విభాగాలలో పనిచేస్తున్నవారిలో పలువురిని లీవ్ లో వెళ్లాలని సూచించారని.. దీంతో తమ ఉద్యోగం ఉంటుందా లేక పోతుందా అని ఆందోళనతో వారు కొట్టుమిట్టాడుతున్నారని సమాచారం.

లీవులో పంపడం, లే ఆఫ్ అమలు చేయడం వంటి చర్యల ద్వారా ఉద్యోగులు తమంతట తామే రాజీనామా చేసేలా చేయడమే సంస్థ వ్యూహమా అనే చర్చ జరుగుతోంది. నేరుగా ఉద్యోగాలు తొలగిస్తే చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. అందువల్లే మధ్యే మార్గంగా వేతన కోతలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్క్యులేషన్ పరంగా ఈనాడు కంటే దూరంలో ఉన్న సాక్షి మాత్రం ఇలాంటివి ఏమీ చేయకుండా ఎప్పటిలాగే తన ఉద్యోగులకు ప్రతినెలా 30 లేదా 31నే వేతనాలిచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనాడు మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తుండటంతో రామోజీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల ఓ డెస్క్ లో పనిచేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఫిల్మ్ సిటీలో పనిచేసే ఎడిటోరియల్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వారిలో 13 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పలువురి సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని మొదలుపెట్టారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...