Switch to English

కేశినేని బానిస సంకెళ్లు పోయేనా?

91,305FansLike
57,012FollowersFollow

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. శ్రీశ్రీ రాసిన ఈ వాక్యం చాలా పాపులర్. ప్రస్తుతం ఇదే వాక్యాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే నాని పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ సీపీలో చేరితే తాను బీజేపీలో చేరినట్టే అంటూ సెటైర్ వేసినప్పటికీ, ఆయన పయనం మాత్రం బీజేపీ వైపే సాగుతోందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగిన తర్వాతే నాని తన అసంతృప్తిని ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారని అంటున్నారు. వాస్తవానికి నాని అసంతృప్తి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు. జిల్లాలో దేవినేని ఉమకు పార్టీపరంగా ప్రాధాన్యత దక్కడం, తనను అంతగా పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఆయనలో అసంతృప్తికి ఆజ్యం పోశాయి.

దీనికి తోడు విజయవాడ పార్టీ కార్యాలయం విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానిలో మరింత ఆగ్రహం కలిగించాయి. విజయవాడ పార్టీ ఆఫీసుగా తన భవనం ఉపయోగించుకోవాలని నాని కోరగా.. చంద్రబాబు అంగీకరించారు. అయితే, తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ కార్యాలయం గొల్లపూడికి మారిపోయింది. దేవినేని ఉమ జోక్యమే ఈ నిర్ణయానికి కారణమని నాని భావించారు. అనంతరం జరిగిన పార్లమెంటరీ పార్టీ పదవుల పంపకం కూడా నానికి మంట పుట్టించింది.

పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్ సభలో టీడీపీ నేతగా రామ్మోహన్ నాయుడులను ఎంపిక చేసిన చంద్రబాబు.. నానికి విప్ పదవి ఇచ్చారు. దీనిపై అసంతృప్తి చెందిన కేశినేని నాని.. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. విప్ పదవి స్వీకరించే సమర్థత తనకు లేదని, ఆ పదవిని సమర్థులకే ఇవ్వండని, తాను విజయవాడ ఎంపీగానే ప్రజలకు సేవ చేస్తానని పేర్కొంటూ చేసిన పోస్ట్ కలకలం సృష్టించింది. వెంటనే ఎంపీ గల్లా జయదేవ్.. నాని నివాసానికి వెళ్లి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నానిని తన ఇంటికి పిలిపించుకుని గంటకు పైగా మాట్లాడారు.

ఈ సందర్భంగా నాని చాలా విషయాలు కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పినట్టు సమాచారం. దేవినేని ఉమ ఒంటెత్తు పోకడల వల్లే పార్టీకి జిల్లాలో ఈ దుస్థితి పట్టిందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ తాను చూస్తానని, అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ మరచిపోయి విప్ పదవి స్వీకరించాలని కోరగా.. నాని మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. పార్టీ మారడంపై నిర్ణయం తీసుకున్నందునే నాని.. ఈ విధమైన చర్యలకు తెరతీశారని అంటున్నారు.

తాజాగా శ్రీశ్రీ వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్టు చేయడం ద్వారా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతోంది. ఎంపీగా రెండోసారి గెలిచిన తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడం వంటి పరిణామాలు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే సంకేతాలు పంపుతున్నాయని అంటున్నారు. నాని ఈ ప్రచారాన్ని ఖండించినా.. త్వరలోనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అదే జరిగితే అసలే ఓటమి బాధతో ఉన్న చంద్రబాబుకు ఇది పెద్ద షాక్ అని చెప్పక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయం: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

రక్తదానం కార్యక్రమంతో నిత్యం వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి అభినందనీయులని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను...

బిగ్ బాస్: మగాళ్ళు వర్సెస్ ఆడాళ్ళ ‘మాటల’ యుద్ధం.!

రేసులో వున్నది ఐదుగురు.. అందులో టాప్ పొజిషన్‌లో ఆదిరెడ్డి, రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో రేవంత్, నాలుగు అలాగే ఐదు స్థానాల్లో రోహిత్, ఫైమా...

నిన్న చిరంజీవి, నేడు రామ్ చరణ్ కు.. జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో...

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీద కనపడితే మెగా ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వారు స్టెప్పేసినా,...

మట్టి కుస్తీ మూవీ రివ్యూ – కొత్తగా ఏం లేదు

పలు తమిళ చిత్రాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. మాస్ మహారాజ్ రవితేజ సహనిర్మాతగా వ్యవహరించిన మట్టి కుస్తీ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

హిట్ 2 మూవీ రివ్యూ – డీసెంట్ థ్రిల్లర్

హిట్ ఫ్రాంచైజ్ లో సెకండ్ మూవీ హిట్ 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ చిత్రం...

రాజకీయం

వైఎస్ షర్మిల చెబుతున్న రాజకీయ సత్యాలు.!

తెలంగాణలో కేసీయార్ కుటుంబమే బాగుపడిందని అంటున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ప్రగతి భవన్‌లో తనిఖీలు చేస్తే వేల కోట్లు బయటపడతాయట. కేసీయార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబం మాత్రమే...

అసలు ఈ చంద్రబాబుకి ఏమయ్యింది.? రాయల్టీ ఎవరికి.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతోన్న చాలామంది ఫాలోవర్స్ వున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. హైద్రాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి...

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి అందుకే తప్పించాం: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అనేక ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. అయితే.. ఉపాధ్యాయులకు బోధనాపరమైన అంశాలు...

పోలవరం.! ప్రాజెక్టు కాదు, మొక్క.! చంద్రన్న ఉవాచ.!

విన్నారా.? పోలవరం అనేది ప్రాజెక్టు కాదట.! మొక్క అట.! అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారు నాటిన మొక్క అట.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంటుంది నారా చంద్రబాబునాయుడిగారి లెక్క.! అసలు పోలవరం...

‘బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న బంధం బయటపెట్టిన జీవీఎల్ నరసింహారావు..’

బీజేపీ-వైసీపీల మధ్య రాజ్యాంగబద్ద సంబంధాలు తప్ప మరేమీ లేదు. వైసీపీకి భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కావాలన్నదే బీజేపీ ఆలోచన అని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో...

ఎక్కువ చదివినవి

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆమెకు ఇచ్చిన గౌరవం నాకెందుకివ్వరు: షర్మిల

‘నన్ను ఆంధ్రావాళ్లు అంటున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు..?’ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడే పెరిగాను.....

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ వుండటంతో ఆమె గట్టెక్కింది. నిజానికి,...

మహేష్ కొడుకు గౌతమ్ స్టేజ్ షో అదరగొట్టేసాడుగా… వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మన్స్...

ఏపీ నూతన సీఎస్ గా కె.ఎస్.జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...

మట్టి కుస్తీ మూవీ రివ్యూ – కొత్తగా ఏం లేదు

పలు తమిళ చిత్రాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. మాస్ మహారాజ్ రవితేజ సహనిర్మాతగా వ్యవహరించిన మట్టి కుస్తీ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా...