పీఆర్సీ విషయంలో ఏం జరిగింది.? సీపీఎస్ రద్దు విషయంలో ఏం జరగబోతోంది.? కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో. తొలుత ప్రభుత్వ ప్రతిపాదన అద్భుతమన్నారు.. ఆ తర్వాత ఛండాలమన్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులంతా అవినీతిపరులేనని అధికార పార్టీ నేతలు విమర్శించారు. ఏమయ్యిందోగానీ, ఆ తర్వాత పీఆర్సీ విషయమై ప్రభుత్వానికి తలొగ్గారు.. ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల్ని నిండా ముంచేశారు.
ఇప్పుడు సీపీఎస్ రద్దు వ్యవహారం తెరపైకొచ్చింది. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నేత హోదాలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే, ఆ విషయాన్ని మర్చిపోయారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్.. అని చెప్పుకుంటున్న వైసీపీ, ఆ మేనిఫెస్టోలోని సీపీఎస్ రద్దుకి బదులుగా ఇప్పుడు జీపీఎస్ తెరపైకి తెచ్చింది.
పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగుల చేత ‘మాకు కొత్త పీఆర్సీ వద్దు.. పాత విధానంలోనే వేతనాలు చెల్లించాలి..’ అనిపించేయడంలో వైఎస్ జగన్ విజయం సాధించేశారు. కొత్త పీఆర్సీ ద్వారా ఉద్యోగుల్ని ఉద్ధరించేస్తున్నామని చెబుతూనే, ఉద్యోగుల్ని నిండా ముంచేశారు.
ఇప్పుడేమో సీపీఎస్ రద్దు వ్యవహారం. సీపీఎస్ కంటే జీపీఎస్ మేలు.. అంటూ ప్రకటనలు గుప్పించుకుంటున్నారు.. అదీ ప్రజాధనంతో. ఇలా పబ్లిసిటీ కోసం వృధా చేసే సొమ్ముని, ఏ సంక్షేమ పథకం కోసమో, అభివృద్ధి కార్యక్రమం కోసమో వినియోగించొచ్చు కదా.? అంటే, పబ్లిసిటీ పేరుతో సొంత మీడియా సంస్థల్ని మేపుకోవడమెలా.? అన్న సమాధానం అనధికారికంగా వైసీపీ నేతల నుంచి వస్తుంటుంది.
అధికార పార్టీ నేతలకు మంత్రి పదవులు పోతే, అభివృద్ధి మండళ్ళ పేరుతో క్యాబినెట్ ర్యాంకులిస్తారు.. సలహాదారుల్ని అడ్డగోలుగా మేపుతారు.. కానీ, ఉద్యోగుల సమస్యలొచ్చేసరికి.. రాష్ట్ర ఖజానా బాగాలేదంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతారు. ఇదండీ వైసీపీ బులుగు రాజ్యాంగం.!
116897 582370This blog truly is great. How was it made ? 87438
633182 791881I always was interested in this topic and nonetheless am, thankyou for posting . 660865
797295 15604Hello fellow web master! I actually enjoy your internet site! I liked the color of your sidebar. 192218
260359 993370quite great put up, i really adore this web site, keep on it 147962
789030 32771Maintain up the wonderful piece of function, I read couple of blog posts on this internet website and I believe that your website is real fascinating and has lots of excellent data. 777254
141448 125086when i was a kid, i adore to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 937101