Switch to English

రాశి ఫలాలు: శనివారం 30 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:18
తిథి: చైత్ర అమావాస్య రా.12:32వరకు తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: అశ్విని రా.7:40 వరకు తదుపరి భరణి
యోగం: ప్రీతి మ.3:05 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: చతుష్పాద మ.1:00 వరకు తదుపరి నాగవ
వర్జ్యం: మ.3:30 నుండి 5:09 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:44నుండి 7:36 వరకు
రాహుకాలం: ఉ.9:00నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.5:54 నుండి 7:29వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:18 నుండి తె.5:06 వరకు
అమృతఘడియలు:మ.12:12 నుండి 1:52 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48నుండి మ.12:38వరకు

ఈరోజు (30-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులు తో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

వృషభం: నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిధునం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది.

సింహం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగార్థులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.

కన్య: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

తుల: స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలుచేసి ఇబ్బందులకు గురిఅవుతారు. ఉద్యోగవాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి.

ధనస్సు: వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మరింత కష్టంతో గానీ ఫలితం లభించదు.

మకరం: ధనదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి.

కుంభం: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.

మీనం: పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...