Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: తెలంగాణ.. మహారాష్ట్రని మించిపోతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 1892 కేసులు నమోదయ్యాయి తెలంగాణలో. వీటిల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన కేసుల సంఖ్య 1658. తెలంగాణలో కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఈ నెంబర్స్‌. పైగా, తెలంగాణలో నిన్న వెల్లడయ్యింది కేవలం 5965 టెస్టుల ఫలితాలు మాత్రమే. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నిన్న దాదాపు 39 వేల కరోనా టెస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో తెలంగాణలోనూ కరోనా టెస్టులు జరిగితే, ఫలితాల్లో పాజిటివ్‌ కేసులు ఎన్ని వుంటాయో ఊహించుకోవడం నిజంగానే భయానకం. దేశంలో చాలా రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నిన్నటి ఫలితాలతో దాదాపు 30 శాతంగా పాజిటివిటీ రేటు వున్నట్లు కన్పిస్తోంది. మొదట్లో తెలంగాణలో కరోనా వైరస్‌ ‘కట్టడి’ బాగానే జరిగినా, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పరిస్థితి మారిపోయింది.

రెండంకెలు, మూడంకెలకు చేరుకుని.. అంతలోనే తగ్గి.. సింగిల్‌ డిజిట్‌కి వచ్చేసి.. ఇప్పుడు నాలుగంకెల స్కోరుకి రోజువారీ కేసులు నమోదవుతున్నాయంటే, ఇందులో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. పైగా, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వైద్య సౌకర్యాలపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల్ని చేర్చుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని సుముఖత వ్యక్తం చేయడంతో, అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. బాధిత కుటుంబాలు తమ ఆవేదనను సోషల్‌ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నాయి. హైకోర్టు పదే పదే హెచ్చరిస్తున్నా, తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య ఐదంకెలకు చేరుకోవడంలేదు. చాలా కష్టపడి రోజువారీ టెస్టుల సంఖ్య ఐదు వేలు దాటిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ధనిక రాష్ట్రం తెలంగాణలో వైద్య రంగం ఇంతటి దుస్థితిలో వుందా.? అని సగటు తెలంగాణ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటోంది.

‘ఏం భయపడాల్సిన పనిలేదు..’ అని ప్రభుత్వం చెబుతున్నా, కరోనా వైరస్‌ కారణంగా అభాగ్యులు అత్యంత ఆవేదనా భరితంగా ప్రాణాలు కోల్పోతున్న వైనం.. సున్నిత మనస్కుల్ని కుంగదీసేస్తోంది. మరీ ముఖ్యంగా, ‘హైద్రాబాద్‌లో ఇక బతకలేం..’ అన్న భావనతో మహా నగరాన్ని వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏదిఏమైనా, మహారాష్ట్ర లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కి రాకుండా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కోవాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...