Switch to English

కరోనా వైరస్‌: టీడీపీ – వైసీపీ.. దొందూ దొందే.!

ఒకరేమో కరోనా వైరస్‌ పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు.. ఇంకొకరేమో.. అదే కరోనా వైరస్‌ పేరు చెప్పి తమవంతు పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడతారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీరు ఇది. ప్రతిపక్షం పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిందే.. ఎందుకంటే, అధికారంలోకి రావాలి కాబట్టి. అధికార పక్షం అలా కాదు.. అధికార పక్షానికి పబ్లిసిటీ స్టంట్లు చేసేందుకు చాలా అవకాశాలుంటాయి.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ – వైసీపీ ‘రాజకీయ కక్కుర్తి’ ప్రదర్శిస్తున్నాయి. మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు.. ప్రజలకు భరోసా ఇవ్వడం మాటెలా వున్నా, మీడియాతో మాట్లాడే సమయంలో.. సగం కంటే ఎక్కువ సమయం చంద్రబాబుని విమర్శించేందుకే కేటాయిస్తున్నారు. ఇంతకన్నా భావదారిద్య్రం ఇంకేముంటుంది.?

విపక్షాలు ఇచ్చే సూచనలు నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వం సంయమనం పాటించాల్సిందే. ఒకవేళ ఆ సూచనలు నచ్చితే పాటించాలి కూడా. ఇక్కడ బేషజాలకు పోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కరోనా వైరస్‌.. అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకోగలిగితే, అట్నుంచి వచ్చే సూచనల్ని పరిగణనలోకి తీసుకోగలిగితే అది అధికారంలో వున్నవారికే హుందాతనం.

చంద్రబాబు, రాష్ట్ర ప్రజల్ని భయపెడుతున్నారంటూ ఓ మంత్రిగారు ఈ రోజు నానా యాగీ చేశారు. చంద్రబాబు భయపెట్టడమేంటి.? కరోనా వైరస్‌ దెబ్బకి అగ్రరాజ్యం అమెరికానే చిగురుటాకులా వణుకుతోంది. ఆ విషయాల్ని నిత్యం మీడియాలో తెలుసుకుంటూనే వున్నారు జనం.

పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ పేరుతో అధికార పక్షం తొలుత పబ్లిసిటీ స్టంట్లు చేసిందిగానీ, జనం మొదటి నుంచీ పూర్తి అవగాహనతో వున్నారన్నది నిర్వివాదాంశం. ఒకవేళ ప్రజలు అప్రమత్తంగా లేకుండా, అధికార పార్టీ చెప్పిన పారాసిటమాల్‌ – బ్లీచింగ్‌ పౌడర్‌ మాటల్ని నమ్మి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది.

ఏదిఏమైనా, అధికారంలో వున్నవారు.. ముఖ్యంగా మంత్రులు.. విపక్షాల మీద విమర్శలు తగ్గించి, ప్రజల్ని ఆదుకోవడం మీద ఫోకస్‌ పెంచితే మంచిది. ప్రధాన ప్రతిపక్షం కూడా పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు పక్కన పెట్టి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా హుందాతనం ప్రదర్శించడం తప్పనిసరి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ లో సురక్షితం కాని అబార్షన్లు 10లక్షలు..!

భారత్ లో గర్భం రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇదే వరుసలో అబార్షన్ చేయించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే గర్భం దాల్చకుండా తీసుకునే జాగ్రత్తల్లో...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...