Switch to English

ఢిల్లీకి సీఎం జగన్: ఈసారి ఏం అద్భుతాలు జరుగుతాయో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు.. ఇందులో వింతేముంది.? రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళతారు, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తారు.. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వున్నాసరే.. ఇది తప్పదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా ప్రత్యేకం. ఆంధ్రపదేశ్ అయితే ఇంకా ఇంకా ప్రత్యేకం.

చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ చుట్టూ నానా యాగీ జరిగేది. ఇప్పుడు అంతకు మించిన యాగీ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళేది, తనపై వున్న కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కొంత మేర ఊరట కోసం అన్నది టీడీపీ సాధారణంగా చేసే ఆరోపణ. కాదు కాదు, కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికే.. అని టీడీపీ ఇంకాస్త గట్టిగా ఆరోపిస్తుంటుంది. ఇది నిజమేనా.? ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే, ఆయనకు ఆయా కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందా.? గతంలో చంద్రబాబు ఇలాగే చేశారా.? అన్నది ఇంకో చర్చ.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారంటే, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరం. అందులో అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా. అదొక్కటే కాదు, రాజధాని సహా అనేక అంశాలున్నాయి. కానీ, ఇవేవీ గడచిన ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న వైఎస్ జగన్ ఢిల్లీ టూర్లలో ప్రాధాన్యతాంశాలు కాలేకపోతుండడమే ఆశ్చర్యకరం. పోలవరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి ఓ డమ్మీ రగడ బీజేపీ – వైసీపీ – టీడీపీ మధ్య జరిగింది. ఆ తర్వాత ఆ వివాదంపై కొంత స్పష్టత వచ్చింది. అంటే, ఇక్కడ సమస్యను పక్కదారి పట్టించే రాజకీయాలు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పక్కగా జరుగుతోందన్నమాట.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ప్రతిపక్షంగా వున్నప్పుడు నినదించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక… కేంద్రం ముందు తమ మెడలు వంచేసుకుంటుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? రాష్ట్రం నుంచి కేంద్రానికి వినతులు వెళతాయి.. కేంద్రం ఆయా అంశాలపై స్పందించినట్లు ఎలాంటి ప్రకటనా రాదు. ముఖ్యమంత్రి మాత్రం ‘అడిగాం.. అడుగుతూనే వుంటాం..’ అని చెబుతారు. ఇదొక నిరంతరం కొనసాగే ప్రసహనం అంతే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...