Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నట విశ్వరూపం చూపిన ‘పున్నమినాగు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చదువు తర్వాత సినిమాల్లోకి వెళ్లాలనుకున్న చిరంజీవి.. ఇదే విషయం తండ్రి వెంకట్రావు గారికి చెప్తే ప్రోత్సహించారు. అయితే.. సక్సెస్ కాలేకపోతే పరిస్థితి ఏంటని అడిగితే.. ‘ఏముంది.. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోతుంది’ అన్నారట చిరంజీవి. తనపై, తనలోని టాలెంట్ పై చిరంజీవికి అంతటి నమ్మకం. దానిని నిరూపించుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తన నటనలోని పదును చూపించారు చిరంజీవి. అలా ప్రముఖ తమిళ సినీ దిగ్గజ నిర్మాణ సంస్థ ఏవీఎం దృష్టిలో పడ్డారు. ఏవీఎంలో అవకాశం దొరికితే వర ప్రసాదమే ఆరోజుల్లో. ఆ వరాన్ని పొందారు చిరంజీవి. ఆ సినిమానే ‘పున్నమినాగు’.

చిరంజీవి నట విశ్వరూపం ‘పున్నమినాగు’

నాగులు పాత్ర వరంలా భావించి..

అప్పట్లో.. ఏవీఎం తెలుగు, తమిళంలో సినిమాలు తెరకెక్కించేది. అలా మంచి సత్తా ఉన్న కథను సిద్దం చేసింది. పాము ప్రధాన అంశంగా కథ సిద్ధం చేసింది. సినిమాలో నరసింహరాజు హీరో అయినా.. చిరంజీవిదే ప్రధాన పాత్ర. తన ఒంటి నిండా విషం ఉన్నా తనకు తెలీకుండా పాముగా మారిన మనిషి. కోర్కెలు, ఆలోచనలు ఉన్నా కూడా పాములా నటించాలి. పాము కదలికలు, హావభావాలు, కళ్ళలో క్రూరత్వం, మొహంలో గాంభీర్యం, అమాయకత్వం సమపాళ్లలో చుపించగలగాలి. ఇందుకు వర్ధమాన నటులైతే బాగుంటుందని భావించిన ఏవీఎం సంస్థకు తెలుగులో అప్పుడే వెలుగులోకి వస్తున్న చిరంజీవి వరంలా దొరికారు. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏవీఎంలో అవకాశం వరంలా.. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న నాగులు పాత్ర దక్కడం అదృష్టంలా భావించారు.

చిరంజీవి నట విశ్వరూపం ‘పున్నమినాగు’

కన్నీళ్లు పెట్టించిన పాత్ర..

అమాయకుడిలా ఉన్న చిరంజీవి పున్నమి రాత్రిళ్ళు కామంతో రగిలిపోతాడు. తాను విషంతో నిండిపోయానని తెలిసి నిస్సహాయుడిలా మిగిలిపోతాడు. ఈ వేరియేషన్లలో చిరంజీవి చూపిన నట వైవిధ్యం ప్రేక్షకులని కట్టిపడేసింది. పాములా మారే సమయంలో కళ్ళలో రౌద్రం చూపిస్తూ, నాలుక బయట పెట్టి చేసిన సహజ నటన, తన చర్మంపై పాము పుసను తీసే సమయంలో ప్రేక్షకులకు భయం కలిగేలా నటించారు. క్లైమాక్స్ లో పాము గుట్టల్లో, పుట్టల్లోకి వెళ్తున్నట్టు చిరంజీవి కొండల్లోకి పారిపోయే సన్నివేశం ఉంటుంది. నరసింహరాజు పారిపో అంటే.. ‘ ఎక్కడికి పోవాలి.. పోతే పుట్టలోకే పోవాలి ‘ అని చిరంజీవి చెప్పినప్పుడు.. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన నటన, హావభావాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ‘నటుడు పాత్రలో జీవించాలి’ అనే సినీ మాటను చిరంజీవి తొలిరోజుల్లోనే ‘పున్నమినాగు’తో నిరూపించారు.

 

తొలి ఫిలింఫేర్ అవార్డు..

1980లో విడుదలైన ఈ సినిమా కన్నడ సినిమాకు రీమేక్. కుమరన్, శరవణన్, బాలసుబ్రమణియన్ నిర్మాణ సారధ్యంలో రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పున్నమినాగు సినిమా అద్భుత విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. కెరీర్లో చిరంజీవి తొలిసారి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. క్రిటిక్స్ సైతం చిరంజీవి నటనకు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ సినిమాతో తన నటనతో ఎంతగా ప్రేక్షకుల్ని మెప్పించగలనో నిరూపించారు. ఈ సినిమాలో నటనతో చిరంజీవి మరో మెట్టు ఎక్కారు. ఆనాడు తండ్రితో చెప్పిన మాట విలువెంతో ఆనతి కాలంలోనే ‘పున్నమినాగు’తో నిరూపించుకున్నారు చిరంజీవి.

చిరంజీవి నట విశ్వరూపం ‘పున్నమినాగు’

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...