టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎంత స్పీడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నాలుగేళ్లలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకొచ్చిన ఈ అమ్మడికి ఈ మధ్య సరైన హిట్ రాలేదు. దాంతో కాస్త అవకాశాలు తగ్గాయి. అయినా సరే మళ్ళీ అవకాశాలకోసం కాస్త గ్లామర్ డోస్ పెంచేసిన రకుల్ అటు హిందీలో కూడా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రకుల్ చాలా విషయాలు చెప్పింది.
సినిమా ఒప్పుకునే విషయంలో తాను ఎక్కువగా నాన్చనని .. కేవలం ఐదే నిమిషాల్లో నా అభిప్రాయం చెప్పేస్తానని అంటుంది. నేను మొదటి నుండి అంతే .. నాకు ఏదైనా స్పీడ్ గా జరగాలి. అనవసరంగా నాన్చడం అంటే చిరాకు అంటూ చెప్పేసింది. దర్శకుడు వచ్చి కథ చెప్పాకా .. నా నిర్ణయం వెంటనే చెబుతా ? కథ నచ్చిందా ? లేదా ? సినిమా కు ఓకే అంటే ఓకే లేదంటే లేదు అని. అంతే కానీ రెండు రోజుల తరువాత చెబుతాను, రేపు చెబుతా అంటూ నాన్చడం నచ్చదు అని చెప్పింది.
రకుల్ చెప్పినట్టు ఆమె మాటల్లోనే కాదు చేతల్లో కూడా అదే స్పీడ్ మైంటైన్ చేస్తుంటుందని చాలా మంది దర్శక నిర్మాతలు అన్నారు. షూటింగ్ లోకూడా అదే జోరుతో ఉంటుందట. గ్లామర్ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రస్తుతం నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటిస్తుంది. దాంతో పాటు హిందీలో అజయ్ దేవగన్ తో దే.. దే.. ప్యార్.. దే చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుంది, అందుకే బాలీవుడ్ భామల స్టైల్ లో గ్లామర్ బాట పట్టేసి .. డోస్ బాగా పెంచేసింది రకుల్.