జూన్ 21న ప్రపంచం అంతమైపోనుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మయాన్ కేలండర్ చదవడంలో జరిగిన పొరపాటు కారణంగా అప్పుడు తేదీని అంచనా వేయడంలో తప్పిదం జరిగిందని, కానీ ఈసారి జూన్ 21న ప్రపంచం అంతం కావడం ఖాయమన్నది కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తల వాదన. అయితే, దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు.
గతంలో 2012 డిసెంబర్ 21న యుగాంతం వస్తుందని, ప్రపంచం మొత్తం అంతమైపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలామంది తీవ్ర ఆందోళనకు కూడా గురయ్యారు. అయితే నాసా అప్పుడే అలాంటిది ఏమీ జరగదని తేల్చి చెప్పింది. 2012 డిసెంబర్ 21న ఏమీ జరగలేదు. దీంతో మయాన్ కేలండర్ ప్రకారం డూమ్స్ డే వస్తుందంటూ జరిగిన ప్రచారం అబద్ధమని తేలిపోయింది.
తాజాగా కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం మనం గ్రెగోరియన్ కేలండర్ వినియోగిస్తున్నాం. దాని ప్రకారం 2020 జూన్ లో ఉన్నాం. అయితే, జూలియన్ కేలండర్ ప్రకారం ఇది 2012 సంవత్సరమని.. ఆ లెక్కన ఈనెల 21న యుగాంతం సంభవిస్తుందన్నది వారి వాదన. గ్రెగోరియన్ కేలండర్ కు జూలియన్ కేలండర్ కు 11 రోజుల వ్యత్సాసం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం 2012 సంవత్సరం నడుస్తోందని.. జూన్ 21న యుగాంతం సంభవిస్తుందని పేర్కొంటున్నారు.
కానీ ఇది ఒట్టి డొల్ల వాదన అని.. యుగాంతం అనేది ఏదీ రాదని చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రచారం తప్పు అని తేలడంతో ప్రస్తుతం దీని గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. కానీ కొందరు మాత్రం ఈ అంశాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
148005 923129I undoubtedly did not realize that. Learnt something new today! Thanks for that. 311184
169143 580359Thank you for sharing with us, I believe this internet site genuinely stands out : D. 133559
336817 54344This web website could be a walk-through for all of the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 536752
718466 256283Dude.. My group is not considerably into looking at, but somehow I acquired to read several articles on your weblog. Its wonderful how intriguing it is for me to visit you fairly often. 354356