Bro Movie Review: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా షూటింగ్ రికార్డ్ సమయంలో పూర్తయింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని అదే దర్శకుడు సముద్రఖనితో తెలుగులో తీశారు. ఈరోజే బ్రో విడుదలవ్వగా మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) బాధ్యత గల వ్యక్తి. తన తల్లి, సోదరుడు, సోదరుల బాధ్యత మొత్తం తనే చూసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో తనకంటూ ఒక జీవితం ఉంటుంది అనే విషయాన్నే మర్చిపోతాడు. ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తూ ఒక రోజు రోడ్డు ప్రమాదంలో మార్కండేయులు మరణించి టైమ్ (పవన్ కళ్యాణ్) వద్దకు వెళ్తాడు. అక్కడ తనకు 9- రోజుల గడువు లభిస్తుంది.
ఈ 90 రోజుల్లో మరి తన జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి ఏమవుతుంది అన్నది చిత్ర కథ.
నటీనటులు:
పవన్ కళ్యాణ్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైలింగ్ రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కుతుంది. తన పాత్ర ద్వారానే ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకులకు కలగాలి. సాయి ధరమ్ తేజ్ తన వంతుగా ప్రయత్నించినా ఇంకా ఏదో మిస్ అయిన భావన కలుగుతుంది. తన వైపు నుండి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ విషయంలో ఇంకా బెటర్మెంట్ ఆశిస్తాం.
కేతిక శర్మ చార్మింగ్ గా ఉంది. ప్రాధాన్యత పరంగా మిగిలిన పాత్రలకు అంత స్కోప్ దక్కలేదు.
సాంకేతిక నిపుణులు:
సముద్రఖని కథకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సరిగ్గా సరిపోయాయి. పవన్ కళ్యాణ్ వాటిని ఎనర్జిటిక్ గా ప్రెజంట్ చేసిన విధానం ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గరనుండి కథనం పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన భావన కలుగుతుంది. అయితే మళ్ళీ క్లైమాక్స్ పైకి లేవడంతో ఆడియన్స్ సంతృప్తి చెందుతారు.
మొత్తంగా చూసుకుంటే సముద్రఖని ఒరిజినల్ సోల్ ను మిస్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ ఛరిస్మాకు మ్యాచ్ అయ్యే విధంగా సినిమాను మలచడంలో సక్సెస్ సాధించాడు. ఇక థమన్ అందించిన పాటలు పూర్తిగా నిరుత్సాహపరుస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా ఆ నిరుత్సాహాన్ని కనపడకుండా చేసాడు థమన్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్:
- పవన్ కళ్యాణ్ నటన
- ఫ్యాన్స్ స్టఫ్
- తక్కువ రన్ టైం
- ఎమోషనల్ క్లైమాక్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్
విశ్లేషణ:
మీరు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే బ్రో మీకు కచ్చితంగా బాగా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులకు కూడా బ్రో లో ఒక మంచి మెసేజ్ ఉంది. సరైన పరిమాణాల్లో ఫన్, ఎమోషన్ ఉండటం ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశముంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5