భారతీయ జనతా పార్టీకి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దిమ్మ తిరిగే షాకిచ్చాయి. మరీ దారుణమైన పరాజయం.. అనేయలేంగానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి జార్ఖండ్లో తగిలిన దెబ్బని మరీ చిన్నదిగా కూడా చూడలేం. దేశంలో బీజేపీ తిరోగమనంలో పయనిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు.
మొన్నీమధ్యన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శివసేన – బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టినా, బీజేపీ.. అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. మిత్రపక్షం శివసేన, బీజేపీ ‘వంచన’ని జీర్ణించుకోలేక.. కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టాల్సి వచ్చింది. నిజానికి, సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే, బీజేపీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు గట్టి దెబ్బ కొట్టారనే చెప్పాలి. ‘అతి పెద్ద పార్టీ మాదే..’ అంటూ బీజేపీ, సీట్ల లెక్కలు చెప్పొచ్చుగాక.! ఇప్పుడు జార్ఖండ్ విషయంలోనూ బీజేపీ బుకాయింపులకు దిగుతోంది.
‘ఓటమి కొంత బాధ కలిగించిందిగానీ.. ఇది ప్రజా వ్యతిరేకతగా మేం చూడటంలేదు.. కేంద్ర ప్రభుత్వంపై ఈ ప్రభావం అస్సలు పడదు..’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతల వాదనల్లో కొంత నిజం వుంటే వుండొచ్చు. రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు వ్యతిరేకతతో వున్నారనే విషయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరూపితమయ్యింది.
2018 నాటికి దేశమంతా కాషాయమయం అయిపోయింది. కానీ, ఇప్పుడు ఆ రంగు వెలిసిపోతోంది. ఒక్కో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. అదీ, సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోనే సీన్ మారిపోయింది. సో, ఇదే మొండి వైఖరిని కేంద్రంలోని మోడీ సర్కార్ ముందు ముందు కొనసాగితే, ఖచ్చితంగా కేంద్రంపై ఆ ప్రభావం వుండి తీరుతుంది.
964014 385112Thank her so significantly! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 449449
200181 465734Hi! I discovered your web site accidentally today, but am truly pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 980111
464634 208292Usually I dont read article on blogs, but I would like to say that this write-up very compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, quite excellent post. 469788