Switch to English

బర్త్‌డే స్పెషల్‌: విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్‌ అయ్యాడు

ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. మహామహుల వారసులు తెరగేట్రం చేసి స్టార్స్‌ అవ్వాలని కలలు కన్నారు. కాని వారసత్వం అనేది కేవలం ఎంట్రీ వరకే పరిమితం. స్టార్స్‌ అవ్వాలంటే ఖచ్చితంగా ట్యాలెంట్‌ ఉండాలి. అది ఇప్పటి వరకు ఎంతో మంది విషయంలో నిరూపితం అయ్యింది.

ఒక హీరో వెనుక సూపర్‌ స్టార్స్‌.. మెగాస్టార్స్‌ ఉన్నంత మాత్రాన ఆ హీరో సూపర్‌ సక్సెస్‌ కాలేడు. ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అంతా కూడా సొంతంగా కష్టపడాల్సిందే. సొంతంగా నిరూపించుకున్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ట్యాలెంట్‌ లేకుంటే రెండూ ముడు ఏళ్లకే కనుమరుగవుతారు. కాని వారసత్వంతో ఇండస్ట్రీలో పరిచయం అయిన సందీప్‌ కిషన్‌ మాత్రం తన ట్యాలెంట్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆధరణ పొంది ఏకంగా దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

చోటా కే నాయుడు, శ్యామ్‌ కే నాయుడుల మేనల్లుడు అయిన సందీప్‌ కిషన్‌ ‘ప్రస్తానం’ చిత్రంతో 2010 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సందీప్‌ కిషన్‌ మొదటి సినిమాలోనే నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేయడం సాహస నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తానంలో సందీప్‌ కిషన్‌ పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా తనదైన ముద్రను వేశాడు. అదే ఏడాది స్నేహగీతంలో వన్‌ ఆఫ్‌ ది హీరోగా నటించి మెప్పించాడు.

ఆ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. 2012 సంవత్సరంలో సందీప్‌ కిషన్‌ రెజీనాతో కలిసి రొటీన్‌ లవ్‌ స్టోరీ చిత్రంలో నటించాడు. ఆ సినిమా సందీప్‌ కిషన్‌ను వెనుదిరిగి చూడకుండా చేసింది. రొటీన్‌ లవ్‌ స్టోరీ చిత్రంలో సందీప్‌ కిషన్‌లోని కొత్త యాంగిల్‌ బయటకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ను అభిమానించడం మొదలు పెట్టారు. ఆ తదుపరి ఏడాది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంతో సందీప్‌ కిషన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

ఆ సినిమాలో సందీప్‌ కిషన్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుసగా చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకు పోతున్నాడు. టైగర్‌ చిత్రంతో విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్‌ పడటంతో స్నేహితులతో కలిసి సందీప్‌ కిషన్‌ నిర్మాతగా కూడా మారాడు.

కాస్త గ్యాప్‌ తర్వాత నిను వీడని నీడను నేనే చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్‌ను దక్కించుకున్నాడు. మొత్తానికి కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతున్నా కూడా తట్టుకుని నిలబడి హీరోగా తన జర్నీని సాగిస్తున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు వ్యాపార సామ్రాజ్యంను క్రియేట్‌ చేయడంలో సందీప్‌ కిషన్‌ సక్సెస్‌ అయ్యాడు.

సందీప్‌ కిషన్‌ సెలూన్‌ బిజినెస్‌తో పాటు వివాహ భోజనంబు రెస్టారెంట్‌ బిజినెస్‌లోనూ ఎంటర్‌ అయ్యాడు. కొన్ని వందల మందికి ఉపాదిని కల్పించడంతో పాటు లక్షల మందిని ఎంటర్‌టైన్‌ చేస్తున్న సందీప్‌ కిషన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన అభిమానుల తరపున.. తెలుగు సినీ ప్రేక్షకుల తరపున ఇంకా మా తెలుగు బులిటెన్‌ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సందీప్‌ కిషన్‌ ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలని అలాగే ఆయన వ్యాపారం మరింతగా విస్తరించాలని కోరుకుందాం.

బర్త్‌డే స్పెషల్‌ : విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్‌ అయ్యాడు బర్త్‌డే స్పెషల్‌ : విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్‌ అయ్యాడు బర్త్‌డే స్పెషల్‌ : విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్‌ అయ్యాడు బర్త్‌డే స్పెషల్‌ : విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్‌ అయ్యాడు

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో...

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో భారీ పవర్ ప్లాంట్ బ్లాస్ట్.!

గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీని వలన తాజాగా తెలంగాణ, నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి...

‘కరోనా వ్యాక్సీన్’ తయారు చేస్తున్న అ! దర్శకుడు

యువదర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో రాబోతున్నాడు. మొదరి చిత్రం అ! తో విమర్శకుల మెప్పు సాధించిన ప్రశాంత్ రెండో ప్రయత్నంగా సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే చిత్రం తెరకెక్కించాడు....

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...