Switch to English

బిగ్ బాస్ తెలుగు 7: మళ్ళీ అవే చెత్త నామినేషన్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

వీకెండ్ ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే.! ప్రతి సోమవారం హౌస్‌లో నామినేషన్ల పర్వం నడుస్తుంది.. వీకెండ్ ఎలిమినేషన్ కోసం.! హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి.. అలా బయటకు పంపేసే కంటెస్టెంట్స్ (అందులో ఒకరే బయకెళ్తారు) సంబంధించి, సరైన రీజన్‌ని కంటెస్టెంట్లు ఎంచుకోవాల్సి వుంటుంది.

కానీ, సిల్లీ నామినేషన్లతో ప్రతి సోమవారం పెంట పెంట చేసేస్తున్నారు కంటెస్టెంట్లు.! సిల్లీ రీజన్స్ కుదరవంటూ గతంలో బిగ్ బాస్ హెచ్చరించేవాడు.. లేదంటే, హోస్ట్ క్లాస్ తీసుకునేవాడు.. అది గతంలో వ్యవహారం. ఇప్పుడు పరిస్థితి వేరు.

అర్జున్‌ని తేజ సరదాగా నామినేట్ చేసేశాడు. చూడ్డానికి పరమ అసహ్యంగా అనిపించింది ఈ ఇద్దరి మధ్యా సంభాషణ. అంత సిల్లీగా వుంటే, అసహ్యంగానే వుంటుంది.. అక్కడికేదో కామెడీ అని ఇద్దరూ అనుకున్నారు. తేజ నామినేషన్‌తోనే సందీప్ ఔట్ అయిపోయాడన్న విషయాన్ని అర్జున్ మర్చిపోతే ఎలా.?

ఏడవలేక నవ్వినట్లు అర్జున్ వ్యవహరించాడా.? నిజంగానే నవ్వు వచ్చిందా.? ఏమో, అది అర్జున్‌కీ, తేజకీ తెలియాలి. ఇంకోపక్క ప్రియాంక – భోళే షావళి మధ్య గోల గోల అయ్యింది నామినేషన్ల సందర్భంగా. షరామామూలుగానే అమర్ – భోళే షావలి మధ్య కూడా రచ్చ జరిగింది.

శివాజీ చెప్పిన సిల్లీ రీజన్స్.. ఇంకా చెత్తగా వున్నాయి. అమర్ దీప్ అగ్రెసివ్ అయితే తప్పు.. పల్లవి ప్రశాంత్ ఎంత ఛండాలం చేసినా మంచిగానే వుంటుందన్నట్లు శివాజీ వ్యవహరించిన తీరు, నామినేషన్లలో శివాజీ కన్నింగ్ మెంటాలిటీని ఎక్స్‌పోజ్ చేసేసింది.

మరోపక్క, రతిక ఏదో వాదన పెట్టుకోవాలి కాబట్టి.. అన్నట్లే వ్యవహరించింది. దానికి ప్రియాంక నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇంకా సిల్లీగా వుంది. ఓవరాల్‌గా కంటెస్టెంట్లలో ఎవరూ నామినేషన్ కోసం సరైన రీజన్స్ చెప్పలేకపోయారు.

గత వారం కుర్చీని తన్నిన అమర్ దీప్, ఈ వారం ఓ స్టూల్ లాంటిదాన్ని తన్నేశాడు. వీకెండ్‌లో నాగార్జున నుంచి ఇంకో క్లాసు, అమర్ దీప్ నుంచి ఇంకో క్షమాపణ ఫిక్సయిపోయినట్టే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...