కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందన్న చందంగా మారింది హైదరాబాద్ లోని ఓ మహిళ అందం కోసం చేసిన ప్రయత్నం. భర్త కోరిక మేరకు మోడల్ కావాలనుకున్న ఆశ బెడిసి కొట్టింది.
జుట్టు కత్తిరించుకోవడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన ఆమెకి షాక్ తగిలింది. తనకున్న పొడవు జుట్టును కత్తిరించుకొని అందంగా మారేందుకు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ శంషాబాద్ ప్రాంతంలోని బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది. తనకి మోడల్ అవ్వాలని ఉందని అందుకనుగుణంగా తనకి హెయిర్ డ్రెస్సింగ్ చేయాలని కోరింది. ఆమె కోరిక మేరకు బ్యూటీషియన్ జుట్టు కత్తిరించి ఆయిల్ పెట్టింది.
నూనె పెట్టిన కాసేపటికి సదరు మహిళ జుట్టు రాలడం మొదలైంది. కొంతసేపటికి జుట్టు మొత్తం రాలిపోవడంతో తన భర్తకి జరిగిన విషయం చెప్పింది. దీంతో షాక్ అయిన ఆమె భర్త బాధిత మహిళతో గొడవపడ్డాడు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి బ్యూటీ పార్లర్ పై కంప్లైంట్ ఇచ్చింది. చెప్పినా వినకుండా బ్యూటీషియన్ తన చుట్టూ నూనె రాసిందని కంప్లైంట్ లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.