Switch to English

ఎట్టకేలకు రైట్‌ ట్రాక్‌లోకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,456FansLike
57,764FollowersFollow

తెలుగు మీడియం విషయంలో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రైట్‌ ట్రాక్‌లోకి వచ్చినట్లు కన్పిస్తోంది. ఆరో తరగతి తర్వాతనే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి.. అంటున్నారిప్పుడు వైఎస్‌ జగన్‌. మంచి ఆలోచనే ఇది. నిజానికి, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మొదటి నుంచీ ఇంగ్లీషు మీడియంకే పరిమితం చేస్తున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రిక్షా నడిపే వ్యక్తి కూడా తమ పిల్లల్ని కాన్వెంట్‌కి పంపించాలనుకుంటున్నారు తప్ప, ప్రభుత్వ పాఠశాలల వైపు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అందుకు కారణాలనేకం.

అలాగని, తెలుగు మీడియంని పూర్తిగా తొలగించాలన్న ఆలోచన, తెలుగు నేల మీద జరిగితే, మాతృ భాషకి అంతకన్నా అవమానం ఇంకొకటుండదు. ప్రపంచంతో పోటీ పడాల్సిందే.. ఈ క్రమంలో ఇంగ్లీషుని మొదటి నుంచీ నేర్చుకోవాల్సిందే. కానీ, ఆ పేరు చెప్పి మాతృ భాషని మృత భాషగా మార్చేస్తామంటే ఎలా.? ఇది చాలా సెన్సిటివ్‌ పాయింట్‌. ‘తెలుగు మీడియంలోనే చదవాలి..’ అని ఎవరన్నా అంటే అది పెద్ద తప్పు. ఇంగ్లీషు మీడియంలోనే చదవాలి.. అన్నాసరే అంతే.

ఏ మీడియంలో చదవాలన్నది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనని బట్టి వుంటుంది. ప్రభుత్వం, విధిగా మాతృ భాషని ప్రోత్సహించాలి. అదే సమయంలో, నాణ్యమైన విద్యనూ అందించాలి. తెలుగుతోపాటు, ఇంగ్లీషు మీడియం అంటే సమస్య వుండదు. ఇదే మొదటి నుంచీ జనం మొత్తుకుంటున్నదీ.. ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నదీ. మేధావి లోకం, రాజకీయ పరిశీలకు, రాజకీయ విమర్శకులు, విశ్లేషకులు ఇదే వాదన చేస్తున్నారు.

‘వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు.?’ అంటూ ఓ అర్థం పర్థంలేని ప్రశ్నను తెరపైకి తెచ్చి వితండవాదం చేసిన అధికార వైసీపీ, ఎప్పుడైతే కేంద్రం ‘కొత్త విద్యా విధానం’ ప్రకటించిందో, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు కన్పిస్తోంది. ప్రభుత్వం అన్నాక భేషజాలు, మొండితనం అస్సలు వుండకూడదు. ఇలాంటి సున్నిత విషయాల్లో మరీ అప్రమత్తంగా వుండాలి. ఎలాగైతేనేం, మీడియం వివాదానికి రాష్ట్రంలో తెరపడితే అంతకన్నా కావాల్సిందేముంది.? ప్రభుత్వాధినేతగా, ప్రజల మనసెరిగి పాలన అందిస్తే, ‘భళా’ అన్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ‘తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు..’ అన్నట్లుగా మొండి వాదన విన్పిస్తేనే సమస్యలు ఎదురవుతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...