Switch to English

Ram Charan: ‘రామ్ చరణ్’ పై జెలసీ..! వాళ్ల అరుపులు.. ఏడుపులు షురూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

Ram Charan: పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజులపాటు జరిగిన వేడుకలకు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అపర కుబేరులు.. ప్రపంచ దిగ్గజాలు.. పారిశ్రామికవేత్తలు.. టెక్ సీఈఓలు.. దిగ్గజ నటీనటులు.. క్రీడాకారులు.. మరెందరో అతిధులతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్నారు రామ్ చరణ్-ఉపాసన. చూడముచ్చటైన జంటగా వేడుకలకు హాజరయ్యారు. ఎవరికీ దక్కని ఆహ్వానం.. మెగాస్టార్ చిరంజీవి తనయుడికే దక్కింది. చూసే కళ్లు కుళ్లుకోవా.. నొసలు చిట్లించుకోవా. కానీ.. ఏమీ అనలేని నిస్సహాయతతో గోతికాడ నక్కల్లా చూసే బ్యాచ్.. ఏం దొరుకుతుంది.. నెగటివ్ ప్రచారం చేసేయాలనే తాపత్రయం. దొరికింది. వెంకటేశ్.. వాసు సినిమాలో ‘ఇక మొదలెట్టమంటారా..’ అన్నట్టు.. మొదలెట్టేశారు.

ఖాన్ త్రయం పిలుపు..

బాలీవుడ్ దిగ్గజాలు ఖాన్ త్రయం (షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్) వేదికపై మన తెలుగు పాట ‘నాటు-నాటు’కు చిందేశారు. రామ్ చరణ్ ఇక్కడే ఉన్నాడని షారుఖ్ చెవిలో అక్కడే ఉన్న నీతా అంబానీ చెప్పారు. వెంటనే.. రామ్ చరణ్.. కహా వో తుమ్.. అని షారుఖ్.. రామ్ చరణ్.. కహా వో తుమ్.. రామ్ రామ్ అని అరిచారు సల్మాన్.. అమీర్. చరణ్ వేదికపైకి వెళ్లాడు. నాటు-నాటు పాట మళ్లీ హోరెత్తింది. ఖాన్ త్రయం.. రామ్ చరణ్ తో కలిసి ఐకనిక్ స్టెప్ వేశారు. సందడి రెట్టింపయింది. నలుగురి ఆట.. పక్కన ముఖేశ్ అంబానీ ఫొటోలు వైరల్ అయి ఐకనిక్ సెలబ్రేషన్ అయిపోయింది. దేశమంతా పులకించింది. మరిదంతా చూసే నక్క బ్యాచ్ కన్ను కుట్టదా..! కుట్టింది. ఓ తోక దొరికింది. ఇక మొదలెట్టేశారు. రామ్ చరణ్ ని పిలుస్తూనే ‘ఇడ్లీ.. సాంబార్.. రామ్ చరణ్’ అన్నాడు షారుఖ్. అరవడం మొదలెట్టేశారు. మన తెలుగు హీరోని ఇలా అంటారా.. అంటూ..! ఇదంతా అతి బ్యాచ్ ముసలి కన్నీరు.. నొసట వెక్కిరింపులు. నిజానికి తమ కుళ్లు బయటపెట్టే ప్రాసెస్ లో ఇదొక భాగం.

వారి బాండింగ్ అది..

షారుఖ్, సల్మాన్, అమీర్-రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ తెలిసిందే. అంతటి ఈవెంట్లో రామ్ చరణ్ గురించి నీతా అంబానీ చెప్పడం.. ఖాన్ త్రయం పిలవడం.. చరణ్ రాగానే షారుఖ్ నమస్కారం చేస్తూ ఆహ్వానించడం.. ఖాన్స్ ఆలింగనం.. డ్యాన్స్.. ముఖేశ్ అంబానీ ఆలింగనం చేసుకోవడం.. తట్టుకోలేకపోయారు. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్ కు ఏమైందో.. తనకే అవమానం జరిగినట్టు దీనిని పోస్ట్ చేయడమేంటో..! రామ్ చరణ్ కు ఇంతటి పారిశ్రామిక దిగ్గజం రికగ్నిషన్ దక్కడం ఎందరో హర్షించేది. మరెందరో జీర్ణించుకోలేనిది. షారుఖ్ తన ‘One 2 ka 4’సినిమాలో.. ఇడ్లీ, వడ, సాంబార్, రజినీకాంత్ డైలాగ్ అంటాడు. అదే స్టయిల్లో పిలిచాడు. దీనిని పట్టించుకోవాల్సిన పనే లేదు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ చుట్టూ ఈర్ష్యా, ధ్వేషాలు ఉంటాయి. తండ్రి చిరంజీవి లెగసీని క్యారీ చేస్తున్నట్టే నెగటివిటీని కూడా దాటుకుంటూ రామ్ చరణ్ తన దారిలో వెళ్తూంటాడు. ఎందుకంటే.. అతడు చిరంజీవి కొడుకు టు గ్లోబల్ స్టార్ వయా మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...