సంక్రాంతి పండక్కి వచ్చిన ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుని దర్శకుడు అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో నిలబెట్టింది. ఈ సినిమా తరువాత అనిల్ కోసం పలువురు నిర్మాతలు క్యూ కట్టారు. ఎంతైనా అడ్వాన్స్ ఇచ్చేసి సినిమాకు కమిట్మెంట్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరందరికంటే ముందే అనిల్ టాలెంట్ ని పసిగట్టిన మహేష్ బాబు ఎఫ్ 2 సినిమా సెట్స్ పై ఉండగానే అనిల్ తో చర్చలు జరిపాడట. మంచి కథ తీసుకురా సినిమా చేద్దామని హామీ కూడా ఇచ్చాడట.
సూపర్ స్టార్ లాంటి హీరో సినిమా చేద్దామని అడిగితే ఏ దర్శకుడైన ఏమి చేస్తాడు .. ఎగిరి గంతేసి .. మిగతా ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేసి మహేష్ సినిమా పై ఫోకస్ పెడతాడు. కానీ దానికి విరుద్దంగా అనిల్ రావిపూడి మాత్రం మహేష్ తో సినిమాకు కథ సిద్ధం చేస్తూనే తాను ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విషయంలో మహేష్ కూడా ఓకే చెప్పాడట. ముందు ఆ ప్రాజెక్ట్ చేయి ఆ తరువాత మన సినిమా స్టార్ట్ చేద్దామని అన్నాడట మహేష్.
దాంతో రెట్టించిన ఉత్సహంతో అనిల్ ఆ లేడి ఓరియెంటెడ్ సినిమాకు జోరుగా సన్నాహాలు మొదలెట్టాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకోసం ఎలాగూ నాలుగైదు నెలల సమయం పట్టేలా ఉంది. మహేష్ తనకు నటిస్తున్న మహర్షి షూటింగ్ పూర్తీ చేసాడు కాబట్టి .. ఈ గ్యాప్ లో ఆయన మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మహేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగించే విషయం.
