Switch to English

జగన్‌ సర్కార్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అగ్ర హీరో.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠమెక్కినప్పటినుంచీ సంచలన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే వుంది. ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్‌, పర్యాటక శాఖకు సంబంధించి బ్రాండ్‌ అంబాసిడర్‌ని నియమించబోతున్నట్లు ప్రకటించడం మరో సంచలనంగా మారింది. చంద్రబాబు హయాంలో బ్రాండ్‌ అంబాసిడర్ల నియామకం కొన్ని విభాగాలకు సంబంధించి జరిగినా, వాళ్ళెవరూ అంతగా రాష్ట్రానికి ఉపయోగపడలేదు. అజయ్‌ దేవగన్‌ని అనుకున్నారు కుదరలేదు. సినీ నటి పూనమ్‌ కౌర్‌ని చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తే, దాని వల్ల పార్టీకిగానీ, ప్రభుత్వానికిగానీ ప్రయోజనం కలగని పరిస్థితి.

అయితే, తమ హయాంలో వ్యవహారం డిఫరెంట్‌గా వుంటుందని వైఎస్సార్సీపీ అంటోంది. ఓ ప్రముఖ నటుడితో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన ప్రభుత్వ పెద్దలు, త్వరలోనే ఆ హీరోని ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబోతున్నట్లు సమాచారమ్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పోల్చితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్‌ ఎక్కువ. కానీ, ఇప్పుడు కాదు. తెలుగుదేశం పార్టీ, పూర్తిగా సినీ గ్లామర్‌ని దూరం చేసుకుంది. కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ – సినీ పరిశ్రమ పెద్దల మనసుల్ని గెల్చుకుంది. అయినప్పటికీ, ఇంకా ఎందుకో వైఎస్సార్సీపీ పట్ల సినీ ప్రముఖులు ఇంకా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఆ లోటుని పూడ్చుకోవడానికి అత్యంత వ్యూహాత్మకంగా బ్రాండ్‌ అంబాసిడర్ల ఎంపిక జరుగుతోందని సమాచారమ్‌.

రాజకీయాలకు తావు లేదంటూనే, రాజకీయ కోణంలోనే ఈ ఎంపికలు జరగబోతున్నాయట. ఓ అగ్ర హీరోతోపాటుగా, ఓ స్టార్‌ హీరోయిన్‌తోనూ సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించబోతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు సానియా మీర్జా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత తన వంతు పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. సానియా మీర్జాకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారీ చెల్లింపులు చేసిన తెలంగాణ ప్రభుత్వం, సమంత విషయంలో రెమ్యునరేషన్‌ పెద్దగా ఏమీ ఇవ్వలేదట. పూర్తిగా సమంత సామాజిక బాధ్యతతోనే చేనేతకు ప్రచారకర్తగా వున్నారు.

ఇదిలా వుంటే, జగన్‌ ప్రభుత్వం నియమించనున్న సదరు బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆయన అభిమానులు, ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా మద్దతిచ్చారు. అయితే, ఆ అగ్ర హీరో మాత్రం, అధికారికంగా ఏ రాజకీయ పార్టీకీ మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ఇంతకీ ఎవరా అగ్రహీరో? ఏమా కథ? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...