Switch to English

క్రికెట్‌కి ‘గుడ్‌ బై’: ఇదీ అంబటి రాయుడి గోడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

క్రికెటర్‌ అంబటి రాయుడు, అంతర్జాతీయ క్రికెట్‌కి సంబంధించి అన్ని ఫార్మాట్లకూ గుడ్‌ బై చెబుతూ, తన నిర్ణయాన్ని బీసీసీఐకి పంపించేశాడు. అసలు అంబటి రాయుడు, క్రికెట్‌ నుంచి ఎందుకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు.? అది కూడా వరల్డ్‌ కప్‌ జరుగుతున్న సమయంలో, టీమీడియా రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాడిగా వున్న అంబటి, ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు.? క్రికెట్‌ అభిమానుల్ని ఇలా చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి.

చిన్నప్పటి నుంచీ క్రికెట్‌ మీద అపరిమితమైన ప్రేమతో, బ్యాట్‌ పట్టాడు అంబటి రాంబాబు.. అదీ చాలా చిన్న వయసులో. రంజీలు ఆడాడు.. జాతీయ జట్టుకి సెలక్ట్‌ అయ్యాడు.. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని.. అన్న చందాన, అంబటి రాంబాబు కేవలం బ్యాట్స్‌మెన్‌ మాత్రమే కాదు, వికెట్‌ కీపర్‌ అలాగే బౌలర్‌ కూడా అయినాగానీ, క్రికెట్‌లో రాజకీయాలు అతన్ని ప్రతిసారీ పాతాళంలోకి తొక్కేస్తూనే వచ్చాయి. బహుశా తెలుగువాడు అవడం వల్లే అంబటి రాయుడికి ఇన్ని కష్టాలేమో అంటారు కొందరు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, మరో క్రికెట్‌ లెజెండ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ రైట్‌ టైమ్‌లో అంబటిలోని ప్రతిభను గుర్తించి వుండకపోతే, అంబటి ఈ స్థాయిలో కూడా క్రికెట్‌ ప్రపంచానికి పరిచయమయ్యేవాడు కాదేమో.

47 సగటుతో 50కి పైగా వన్డేలు అంబటి ఆడాడంటే, అది చిన్న విషయమా.? ‘త్రీడీ’ పేరుతో అంబటి రాయుడిని కాకుండా, విజయ్‌ శంకర్‌ని వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ, విజయ్‌ శంకర్‌ కంటే అన్ని విధాలా అంబటి రాయుడే సమర్థుడు. ఈ విషయం బోర్డుకి కూడా తెలుసు. అయినా, క్రికెట్‌లో రాజకీయాలు, అంబటిని పక్కకు నెట్టేశాయి. శిఖర్‌ ధావన్‌ గాయపడినా, ఆఖరికి విజయ్‌ శంకర్‌ కూడా గాయాలతో ఔట్‌ అయినా, అంబటి రాయుడికి అవకాశం దక్కలేదంటే, క్రికెట్‌లో రాజకీయాలు లేవని ఎలా అనుకోగలం.?

దేశానికి క్రికెటర్‌గా తనవంతు సేవలందించాలనుకున్న ఓ మేటి ఆటగాడికి ఇంత పెద్ద అవమానం జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. అదే, ఆ అవమానమే క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాలనే నిర్ణయం తీసుకునే దిశగా అంబటి రాయుడిని ప్రోత్సహించింది. ‘ఇది చాలా తొందరపాటు చర్య.. అంబటిలో ఇంకా సత్తా వుంది.. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే, జాతీయ జట్టులో చోటు సంపాదించుకోగలడు..’ అంటూ కొందరు విశ్లేషించొచ్చుగాక.. కానీ, అవమానాలు తప్ప.. అవకాశాలు దొరకని చోట, ఇంకా అవకాశాల కోసం ఎదురుచూడటం హాస్యాస్పదమే. ఒక్కటి మాత్రం నిజం, క్రికెట్‌లో ఇలాంటి అవమానాలు కొత్త కాదు. సౌరవ్‌ గంగూలీ, గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌.. ఇలా చెప్పుకుంటూ లిస్ట్‌ చాలా పెద్దదే. ఆ లిస్ట్‌లో అంబటి రాయుడు చేరిపోయాడంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

రాజకీయం

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...