Switch to English

పవన్ రెడీ అవుతున్నారు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రకటనలకే కాకుండా ప్రజల్లో ఉండటానికి రెడీ అవుతున్నారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకోగా, పవన్ పోటీచేసిన రెండోచోట్లా ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాలు చేసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే, వాటిని ఆయన తోసిపుచ్చుతూ.. తాను చివరి వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. తాజాగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇలా మొక్కుబడిగా ప్రకటనలు విడుదల చేయడం మాని, ప్రజల్లో ఉండి వారి తరఫున పోరాడాలంటూ పలువురు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కూడా తన పంథా మార్చాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే రైతు సమస్యలపై రోడ్డెక్కాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు వచ్చే సమయానికి అందుబాటులో ఉండాల్సిన విత్తనాలు.. జూలై మొదలైపోయినా ఎక్కడా దొరకడంలేదు. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఈ దుస్థితికి కారణం గత టీడీపీ ప్రభుత్వమేనని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది.

నిజానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది చాలా పెద్ద అస్త్రమే. అయితే.. అటు టీడీపీ, ఇటు జనసేన రెండూ ఈ విషయంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేయడానికి పవన్ సమాయత్తమవుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తయినా, ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమమూ సక్రమంగా చేయలేదని, ఎంతసేపూ భవనాలు కూల్చివేతలు, చంద్రబాబును జైలుకు పంపడం అనే అజెండా ఒక్కటే అమలు చేస్తున్నారని పవన్ విమర్శిస్తున్నారు.

రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ప్రకటించిన నవరత్నాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారని జనసేన వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ స్థానాన్ని తాము కైవసం చేసుకోవడం ఖాయమని చెబుతున్నాయి. పవన్ ఈ విషయంలో ఇలాగే ముందుకెళితే ప్రజల్లో ఆయనకు రాజకీయపరమైన ఆదరణ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ ఉండదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...