Switch to English

మంత్రి అంబటికి అన్నీ తెలుసు.. పోలవరం ప్రాజెక్టు గురించి తప్ప.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

‘నన్ను అరగంట మంత్రి అంటావా.? నీ చరిత్ర తెలుసు.. నీ భార్య సంగతి తెలుసు.. నీ కొడుకు సంగతి తెలుసు.. నీ గురించి తెలుసు.. మీ నాన్న గురించీ, మీ తమ్ముడి గురించి కూడా తెలుసు.. నేను చరిత్ర గురించి మాట్లాడితే, ఉరేసుకు ఛస్తావ్..’ అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద విరుచుకుపడ్డారు.

రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలపు చెక్కతో నేనొకటిస్తా.. అనడంలో వింతేముంది.? కానీ, ఇక్కడ అంబటి రాంబాబు తాను మంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

చంద్రబాబు జాతకం గురించి అన్నీ తెలిసినప్పుడు మంత్రి అంబటి రాంబాబు, చంద్రబాబుని జైలుకు పంపాలి కదా.? చంద్రబాబు బండారం బయటపెట్టాలి కదా.? పెట్టడంలేదంటే, దానర్థమేంటి.? చంద్రబాబుని కాపాడుతున్నట్లే కదా.?

సరే, టీడీపీ – వైసీపీ మధ్య 60-40 అనుబంధం గురించి వేరే చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంత్రి అంబటి రాంబాబుకి ఎంత చిత్తశుద్ధి వుంది.? తాను మంత్రిగా పనిచేస్తున్న శాఖపై ఆయనకు ఎంతటి అవగాహన వుంది.?

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు.. అసలు ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అలాంటి అంబటి రాంబాబు మంత్రిగా వుంటే, రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది.? నిజానికి, ఆ ఇంగితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండాలి.

పోనీ, తెలుసుకుంటారు రాంబాబు అనుకుందాం.. కానీ, ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అంబటి రాంబాబు తెలుసుకున్నారా.? లేదా.? టీడీపీ హయాంలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు, వైసీపీ హయాం కూడా అయిపోతున్నాగానీ, పూర్తవలేదంటే దానర్థమేంటో మరి.!

రాజకీయ నాయకుల చరిత్రలు తెలుసుకోవడం, పరిశోధించడం మానేసి.. పోలవరం ప్రాజెక్టు చరిత్ర గురించి తెలుసుకుని, ప్రాజెక్టుని ముందుకు నడిపించే బాధ్యతను అంబటి చిత్తశుద్ధితో నెరవేర్చితే రాష్ట్రానికేమైనా ప్రయోజనముంటుంది. లేదంటే, గంట.. అరగంట మంత్రిగానే అంబటి చరిత్రలో నిలిచిపోతారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...