అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులను దక్కించుకున్న అల వైకుంఠపురంలో చిత్రం మరో సెన్షేషన్‌కు రెడీ అవుతోంది. సన్ నెక్ట్స్ ద్వారా ఈ చిత్రంను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆన్ లైన్లో రాబోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. చూసిన వారు కూడా మళ్లీ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఈనెల 26వ తారీకున సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుంది. భారీ మొత్తానికి ఈ రైట్స్‌ను దక్కించుకున్న సన్ నెక్ట్స్ భారీ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఆశిస్తుంది. అందుకే పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. సన్ నెక్ట్స్ ను తెలుగు వారు ఎక్కువగా ఉపయోగించరు. అమెజాన్ లేదా హాట్‌స్టార్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆహా వచ్చింది. అల వైకుంఠపురంలో చిత్రం కోసం ఇప్పుడు అంతా సన్ నెక్ట్స్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ విభిన్నమైన మేనరిజంతో పూజా హెగ్డే గ్లామర్‌తో ఈ చిత్రంలో నటించారు. ఇక థమన్ అందించిన పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అల వైకుంఠపురంలో చిత్రం వెండి తెరనే కాకుండా బుల్లి తెరను కూడా బ్లాస్ట్ చేస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు మరియు యూనిట్ సభ్యులు ఉన్నారు. మరి ఈనెల 26న స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో వ్యూస్‌ను రాబట్టుకుంటుందో చూడాలి.
898954 841191Great post, nicely put together. Thanks. I will be back soon to check out for updates. Cheers 896421
918054 19871For some cause the picture just isnt loading appropriately, is at this time there an issue? 512827
986210 867738Wonderful humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time through party and expected to turn into quite funny, amusing not to mention educational in the mean time. finest man wedding speeches 355367