Adipurush Review:ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమా వస్తోందంటే దానికి ఉండే క్రేజ్, బజ్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేవు. ఇక ఆదిపురుష్ వంటి ఒక గొప్ప కథ ఉన్న చిత్రం వస్తోందంటే అంచనాలు ఆకాశాన్ని దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ ఎలా ఉందో చూద్దామా.
కథ:
రామాయణంలో అతి ముఖ్యమైన అరణ్యకాండ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణాసురుడు, హనుమంతుడు… ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు మార్చారు కానీ కథ అంతా మనకు తెలిసిన… రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడం, రాముడు వెతికించడం, చివరికి రావణాసురుడిని అంతమొందించడంతో ఆదిపురుష్ కూడా ముగుస్తుంది.
నటీనటులు:
రాఘవగా చాలా సటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు ప్రభాస్. సీత జాడ కనపడని దగ్గరనుండి తన కళ్ళల్లోనే ఆ బాధను తెలిసేలా ప్రభాస్ ఇచ్చిన ఎక్సప్రెషన్స్ సూపర్బ్. వీరత్వం చూపించాల్సిన సమయంలో కూడా ప్రభాస్ మరీ ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు. మొత్తంగా రాముడు ఎలా ఉంటాడని మనం భావిస్తామో అలానే ఉండటానికి ప్రయత్నించాడు.
ఇక కృతి సనన్ చాలా మ్యాచుర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. నిజానికి అందరినీ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. సీతమ్మ వారు ఇలానే ఉంటారేమో అనే విధంగా ఆమె నటించడం నిజంగా అభినందనీయం.
హనుమాన్, లక్ష్మణ పాత్రల్లో నటించిన దేవదత్త నాగే, సన్నీ సింగ్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. లంకేశ్ పాత్రలో చేసిన సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఈ చిత్రంలో కొంత నిరుత్సాహపరిచాడు. పెర్ఫార్మన్స్ పరంగా పెద్ద కంప్లైంట్స్ లేకపోయినా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలో ఏదో తేడా కొట్టింది.
సాంకేతిక నిపుణులు:
మొదటగా ఓం రౌత్ ను అభినందించాలి. టీజర్ లో ఉన్న విజువల్స్ కంటే స్క్రీన్ మీద విజువల్స్ వంద రెట్లు నయం అనే రీతిలో ఉన్నాయి. రాముడి ఎలివేషన్స్ ఇచ్చే సన్నివేశాలను కూడా ఓం రౌత్ చక్కగా రాసుకున్నాడు. అయితే లంకేశ్ పాత్రను సరిగ్గా డీల్ చేయలేదు అనిపిస్తుంది. విజువల్స్ ఎంత బాగున్నా, వానరసేన విషయంలో ప్రామాణికం మిస్ అయిన ఫీల్ వస్తుంది.
ఇక చిత్రం మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్:
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
- లంకేశ్ పాత్ర చిత్రణ
- వానర సేన
- విఎఫ్ఎక్స్
చివరిగా:
మనందరికీ బాగా తెలిసిన రామాయణాన్ని మరొక్కసారి ఆధునిక పద్దతిలో చెప్పే ప్రయత్నమే ఆదిపురుష్. ఈ ప్రయత్నంలో ఓం రౌత్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని కానీ ఫెయిల్ అయ్యాడని కానీ చెప్పలేం. కానీ అంచనాలు భారీగా పెట్టుకుని వెళితే మాత్రం నిరుత్సాహపడటం ఖాయం.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5