Switch to English

బాబుపై ఏసీబీ కేసు.. వాట్ నెక్స్ట్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో పరాజయం తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రూపంలో మరో షాక్ తగిలింది. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం ఆయనపై నమోదైన ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సాక్ష్యం నమోదు చేస్తామని పేర్కొంది.

ఈనెల 25న ఆమెను కోర్టుకు రావాలని సూచించింది. బాబును ఎలాగైనా జైలుకు పంపించాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామం సహజంగానే ఆనందం కలిగించింది. ఈ కేసులో చంద్రబాబుకు చిక్కులు తప్పవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

బాబును జైలుకు పంపించడమే లక్ష్యంగా తవ్వకాలు సాగుతున్నాయి. ఆయా వ్యవహారాలకు సంబంధించి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అప్పట్లో జగన్ ఆదేశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు అవుతున్నా ఏ విషయంలోనూ తమకు అనుకూలమైన అంశాలు అధికార పార్టీకి దొరకలేదు. సరిగ్గా ఇదే సమయంలో 14 ఏళ్ల క్రితం కేసు తెర పైకి వచ్చింది.

చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరగకుండా చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకన్నారు. అది అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల విషయంలో స్పష్టమైన తీర్పు వెలువరించింది. రాజకీయ నేతలపై దాఖలైన సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో ఆరు నెలలకు మించి స్టే ఉండరాదని ఆదేశించింది.

ఈ తీర్పుతో చంద్రబాబు తెచ్చుకున్న స్టే ఆటోమేటిగ్గా తొలగిపోవడం.. మళ్లీ హైకోర్టు దానిని పొడిగించకపోవడంతో ఏసీబీ కోర్టు దీనిపై దృష్టి సారించి విచారణ ప్రారంభించింది. అయితే, ఈ కేసు విచారణ వల్ల బాబుకు ఏమైనా ఇబ్బంది తప్పదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బాబును జైలుకు పంపడం అంత సులభం కాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఆధారాలు దొరికిన ఓటుకు నోటు కేసు ఏమైందో అందరికీ తెలిసిన విషయమేనని, అలాంటిది ఎప్పుడో 14 ఏళ్ల నాటి ఈ కేసులో సాక్ష్యాధారాలు నిరూపించడం అంత సులభం కాదని అంటున్నారు. మరోవైపు సరైన సమయానికి లభించిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలనే భావనతో అధికార పార్టీ కదులుతోందని తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...