కశ్మీర్ ఫైల్స్ తో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాములు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దానికి 20 రెట్లు వసూలు చేసి నిర్మాతను లాభాల బాట పట్టించింది. కశ్మీర్ లో హిందూ పండిట్స్ పై ముస్లిమ్స్ జరిపిన మారణ హోమాన్ని కథా వస్తువుగా తీసుకుని మరింత ఇంటెన్స్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కశ్మీర్ ఫైల్స్ ను దేశమంతా ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
ఆ తర్వాత వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం ది వాక్సిన్ వార్. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ఈ చిత్రం కూడా మనం కోవిద్ సమయంలో ఎదుర్కొన్న సమస్యల నుండి రూపొందించి తీసింది. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ఇది కూడా సెన్సేషన్ అవుతుంది అనుకున్నాడు కానీ నార్త్ లో ఈ సినిమాకు కలెక్షన్స్ అసలే మాత్రం లేవు. సౌత్ లో అయితే ఈ సినిమాను పట్టించుకునే నాథుడే లేదు. మొత్తానికి కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి గట్టి షాకే తగిలింది.