ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం సప్త సాగరాలు దాటి. కన్నడలో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో ఈ సినిమాకు అగ్రస్థానం దక్కుతుందని అంటున్నారు అక్కడి బయ్యర్లు. అంత పెద్ద విజయం సాధించింది ఈ చిత్రం. అలాంటి చిత్రాన్ని తెలుగులో కొంత గ్యాప్ ఇచ్చి డబ్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు ప్రమోట్ చేసాయి కూడా. ఈ నెల 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.
కట్ చేస్తే నిన్న అర్ధరాత్రి నుండి ఈ సినిమా చడీచప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో దర్శనమిచ్చింది. అంటే కేవలం వారం రోజుల భాగ్యానికి ఈ సినిమాను డబ్ చేసి థియేటర్లలో విడుదల చేశారన్నమాట. ఇప్పుడు కన్నడతో పాటు తెలుగులో కూడా ప్రైమ్ లో విడుదలైంది.
ఇలా వారం రోజుల గ్యాప్ లో చిత్రాన్ని ఓటిటిల్లో దింపుతుంటే ఇక డబ్బింగ్/చిన్న చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఎందుకు ముందుకు వస్తారు?