Switch to English

రివ్యూ : ‘రాజ రాజ చోర’ మంచి ఎంటర్‌టైనర్‌

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow
Movie రాజ రాజ చోర
Star Cast శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు
Director హసిత్ గోలి
Producer టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్
Music వివేక్ సాగర్
Run Time 2hr 29 Mins
Release ఆగస్టు 19, 2021

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌ గా ఈ సినిమా రూపొందింది. హీరో చిన్న దొంగగా కనిపించబోతున్న ఈ సినిమా పై భారీ గా అంచనాలు కల్పించారు. సినిమా మొదటి నుండి ఉన్న అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ

జీరాక్స్ షాప్ లో వర్క్ చేసే భాస్కర్‌ (శ్రీవిష్ణు) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. విద్య ( సునైన) ను పెళ్లి చేసుకున్న భాస్కర్ కు ఒక కొడుకు కూడా ఉంటాడు. సంజన ( మేఘ ఆకాష్‌) ను చూసిన భాస్కర్‌ ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తాను ఒక సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ అని చెప్తాడు. అతడి మోసం ఎలా బయట పడింది… అసలు భార్య ఉండగా సంజనతో భాస్కర్ ఎందుకు ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో అతడి జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అనేది సినిమా కథ.

తెర మీద స్టార్స్‌

శ్రీ విష్ణు ఒక కొంటె దొంగగా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ విషయంలో కూడా శ్రీ విష్ణు ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్‌ లో మాట్లాడే సమయంలో అతడు తెగ నవ్వించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. మేఘ ఆకాష్‌ తన పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మరియు అందం ఆకట్టుకుంది. శ్రీ విష్ణు భార్య పాత్రలో సునైన పాత్ర బాగుంది. పాత్రకు తగ్గట్లుగా మంచి నటనతో ఆకట్టుకుంది. రవి బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయన ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

తెర వెనుక టాలెంట్

కొత్త దర్శకుడు అయినా కూడా హిసిత్‌ గొలి తీసుకున్న కథ బాగుంది. మంచి బ్యాక్ డ్రాప్ తో అతడు తీసుకు వచ్చిన స్క్రీన్‌ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. అతడి కథ మరియు కథనం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందించే విధంగా ఉంది. కామెడీ మరియు ఎమోషనల్‌ సన్నివేశాలను బాగా బాలన్స్ చేస్తూ అతడు ఆకట్టుకున్నాడు. అయితే మద్యలో కాస్త లాగ్ చేయడంతో పాటు స్టోరీ విషయంలో పట్టించుకోనట్లుగా అనిపించింది. వివేక్ సాగర్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఒక పాట కూడా చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రపీ కూడా బాగుంది. పలు సన్నివేశాలు చాలా సహజంగా చూపడంలో సినిమాటోగ్రఫీ బాగా పని చేసింది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. సెకండ్‌ హాఫ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్

  • శ్రీ విష్ణు నటన,
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌,
  • కామెడీ సన్నివేశాలు,
  • ఇంటర్వెల్‌ కు ముందు సన్నివేశాలు
  • క్లైమాక్స్.

బోరింగ్ మోమెంట్స్

  • సెకండ్‌ హాఫ్‌,
  • రన్ టైమ్‌.

విశ్లేషణ:

సినిమా ఫస్ట్‌ హాఫ్ డీసెంట్ గా సాగింది.. సెకండ్‌ హాఫ్‌ మాత్రం కాస్త ఎమోషనల్‌ గా సాగింది. రాజ రాజ చోర ఒక మంచి సినిమా అనిపించింది. హీరో శ్రీ విష్ణు మంచి నటనతో ఆకట్టుకోవడంతో పాటు సినిమా తన భుజ స్కందాలపై వేసుకుని మోశాడు. దర్శకుడు కొత్తవాడే అయినా కూడా మంచి కాన్సెప్ట్‌ మరియు స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించాడు.

చూడాలా? వద్దా? : ఈ మద్య వచ్చిన మంచి సినిమాల్లో ఒక్కటి.. కనుక తప్పక చూడవచ్చు.

తెలుగు బుల్లెటిన్ రేటింగ్‌: 2.75/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...